Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫీస్ ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేస్తే ఎత్తకపోయారో.. ఐఏఎస్‌లకూ పెనాల్టీయే. కొరడా ఝళిపించిన యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులపై కొరడా ఝళిపించారు. ఇంట్లో కూర్చుని ఆఫీసు వ్యవహారాలు నడిపితే కుదరదని తేల్చి చెప్పేశారు. వెంటనే హోమ్ ఆఫీసులను మూసివేసి ప్రభుత్వ పనివేళల్లో తప్పనిసిరిగా ఆఫీసుల్లోనే ఉండాలని సెలవిచ్చారు. తాను ఇకన

ఆఫీస్ ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేస్తే ఎత్తకపోయారో.. ఐఏఎస్‌లకూ పెనాల్టీయే. కొరడా ఝళిపించిన యోగి
హైదరాబాద్ , శనివారం, 29 ఏప్రియల్ 2017 (05:14 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులపై కొరడా ఝళిపించారు. ఇంట్లో కూర్చుని ఆఫీసు వ్యవహారాలు నడిపితే కుదరదని తేల్చి చెప్పేశారు. వెంటనే హోమ్ ఆఫీసులను మూసివేసి ప్రభుత్వ పనివేళల్లో తప్పనిసిరిగా ఆఫీసుల్లోనే ఉండాలని సెలవిచ్చారు. తాను ఇకనుంచి చేసే సర్‌ప్రైజ్ కాల్స్‌కి ఆఫీసునుంచి ఎత్తి సమాధానం ఇవ్వకపోయారో తాట తేలుస్తా అనే రేంజిలో యోగి రెచ్చిపోయారు.
 
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దబాబులు ఆఫీసులకు రావడం మాని సాయంత్రం కులాసాలకు, ప్రయివేటు పనులకు వెళితే ఇకపై కుదరదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేల్చిచెప్పేశారు. అదికారులు ఆఫీసుల్లో ఉన్నారా లేదా అని తెలుసు కోవడానికి తాను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏదో ఒక వేళ ఉన్నట్లుండి ఆఫీసు ల్యాండ్ ఫోన్లకు కాల్ చేస్తానని అదికారులు ఫోన్ ఎత్తకపోతే జరిమానా విధిస్తానని యోగి హెచ్చరించారు. 
 
ఆఫీసులో లేకపోవడానికి తగిన కారణాలు చూపకపోయినా , ముఖ్యమంత్రి కాల్స్ ఎత్తకపోవడానికి తగిన కారణాలు చూపకపోయినా జరిమానా విధిస్తామని యూపీ విద్యుత్ మంత్రి శ్రీకాంత్ శర్మ హెచ్చరించారు. 
 
ఉన్నతాధికారులు పనివేళల్లో ఆఫీసులో కనబడితే, జూనియర్లు కూడా వారిని ఉదహారణగా తీసుకుని అనుసరిస్తారని మంత్రి చెప్పారు. దీంట్లో భాగంగా యూపీ ప్రభుత్వం రాష్ట్రంలోని సీనియర్ అధికారులను హోమ్ ఆఫీసులను వెంటనే మూసివేయాలని ఆదేశించింది. 
 
మార్చి నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యోగి అధికారులను హెచ్చరించారు. రోజుకు 18-20 గంటల పాటు పనిచేయడానికి సిద్ధంగా లేనివారు మరొక ఉద్యోగాన్ని వెతుక్కోవలసి ఉంటుందని చెప్పారు. తర్వాత అటెండెన్స్ సక్రమంగా పాటించడానికి ఆఫీసుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ కూడా పెట్టించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవించే, ప్రేమించే మహిళ హక్కుపై మగాహంకారం పెత్తనం ఏమిటి? సుప్రీం కోర్టు ప్రశ్న