Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీవించే, ప్రేమించే మహిళ హక్కుపై మగాహంకారం పెత్తనం ఏమిటి? సుప్రీం కోర్టు ప్రశ్న

నాగరిక సమాజంలో పురుషాహంకారానికి తావు లేదని ఈవ్ టీజింగ్ పేరిట జరుగుతున్న ఘాతక చర్యలు మహిళల హక్కులనే కాకుండా వారికున్న సహజన్యాయాన్ని కూడా దెబ్బ తీస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక అమ్మాయిని వేధింపులకు గురిచేయడమే కాకుండా ఆమెను ఆత్మహత్యకు పాల్పడేలా

జీవించే, ప్రేమించే మహిళ హక్కుపై మగాహంకారం పెత్తనం ఏమిటి? సుప్రీం కోర్టు ప్రశ్న
హైదరాబాద్ , శనివారం, 29 ఏప్రియల్ 2017 (03:58 IST)
నాగరిక సమాజంలో పురుషాహంకారానికి తావు లేదని ఈవ్ టీజింగ్ పేరిట జరుగుతున్న ఘాతక చర్యలు మహిళల హక్కులనే కాకుండా వారికున్న సహజన్యాయాన్ని కూడా దెబ్బ తీస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక అమ్మాయిని వేధింపులకు గురిచేయడమే కాకుండా ఆమెను ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన ఘటనలో హిమాచల్ ప్రదేశ్ హైకో్ర్టు తనకు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసి పుచ్చిన సందర్భంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
 
పురుషాహంకారం కూడా చట్టానికి లోబడి ఉండాల్సిందే. జీవించటానికి, తన ఎంపికమేరకు ప్రేమించడానికి మహిళకు హక్కు ఉంది. చట్టపరంగా ఆమెకు గుర్తింపు ఉన్నప్పుడు ఆమెకు వ్యక్తిగతమైన ఛాయిస్ ఉంది. దాన్ని సమాజం గౌరవించాలి. ఏ వ్యక్తీ మహిళను ప్రేమించమంటూ బలవంత పెట్టకూడదు. అలాంటి డిమాండును పూర్తిగా తోసిపుచ్చే హక్కు ఆమెకు ఉంది అని సుప్రీకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. 
 
బహిరంగ స్థలాల్లో ఈవ్ టీజింగ్ అనేది మహిళలను తీవ్రమైన వేదింపుకు గురి చేస్తోంది. దీంతో మహిళను గౌరవించాలనే విజ్ఞత సమాజంలో ఏర్పడటం లేదు. ప్రతి స్త్రీకి పురుషుడిలాగే తనదైన స్వేచ్ఛ, తనదైన చోటు ఉంటుంది. పురుషుడికిలాగే రాజ్యాంగంలోని 14వ అధికరణ ప్రకారం సమానత్వం మహిళకూ ఉంది. ఏ మగాడూ బలవంతంగా తన అహాన్ని మహిళపై రుద్దడానికి ప్రయత్నించకూడదు. పురుషాహంకారం కూడా చట్టానికి లోబడి ఉండాల్సిందే. సమానత్వం అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని అపెక్స్ కోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ కేసులో నిందితుడు మహిల స్వీయ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పూర్తిగా ధ్వంసం చేసినందువల్లే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని ధర్మాసన్ అభిప్రాయ పడింది. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న మహిళ మరణ వాంగ్మూలాన్ని ఎలా ఇవ్వగలదు అని నిందితుడి తరపు న్యాయవాది వేసిన ప్రశ్నకు ధర్మాసనం జవాబిస్తూ ఫిట్‌నెస్ సర్ఠిఫికెట్‌ను చట్టం కోరబోదని  వ్యాఖ్యానించింది. అలాగే 80 శాతం కాలిన గాయాలతో ఉన్న మహిళ మరణ వాంగ్మూలాన్ని ఇవ్వలేదని చెప్పడానికి కూడా వీల్లేదని కోర్టు చెప్పింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేదలూ విమాన ప్రయాణం చేయవచ్చు. ఉడాన్‌తో కొత్త విప్లవం