Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేదలూ విమాన ప్రయాణం చేయవచ్చు. ఉడాన్‌తో కొత్త విప్లవం

సామాన్యుడికీ విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌ (ఉడాన్‌) పథకం సత్ఫలితాలను ఇస్తోంది. గురువారం సిమ్లా-దిల్లీ విమానానికి ప్రధాని శ్రీకారం చుట్టిన కొన్ని గంటల్లోనే ఆ మార్గంలో విమాన టికె

పేదలూ విమాన ప్రయాణం చేయవచ్చు. ఉడాన్‌తో కొత్త విప్లవం
హైదరాబాద్ , శనివారం, 29 ఏప్రియల్ 2017 (02:04 IST)
సామాన్యుడికీ విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌ (ఉడాన్‌) పథకం సత్ఫలితాలను ఇస్తోంది. గురువారం సిమ్లా-దిల్లీ విమానానికి ప్రధాని శ్రీకారం చుట్టిన కొన్ని గంటల్లోనే ఆ మార్గంలో విమాన టికెట్లు ఖాళీ అయ్యాయి. గంట ప్రయాణానికి రూ.2,036 సబ్సిడీ కింద ఈ సెక్టార్‌లో ఇస్తున్న సీట్లన్నీ జూన్‌ వరకూ బుక్‌ అయ్యాయి. ప్రస్తుతం సబ్సిడీ లేని సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌ ఇండియా అనుబంధ అలయన్స్‌ ఎయిర్‌ తెలిపింది. సబ్సిడీలేని టికెట్ల ధరలు రూ.5300 నుంచి 19,080గా ఉన్నట్లు పేర్కొంది. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త పథకానికి అనూహ్య స్పందన లభించిందని సంస్థ సీఈవో సీఎస్‌ సుబ్బయ్య తెలిపారు.
 
ఈ సెక్టార్‌లో 42 సీటర్ల విమానాలను అలయన్స్‌ ఎయిర్‌ వారానికి ఐదు రోజుల చొప్పున నడుపుతోంది. దీంతో పెద్దగా అనుసంధానం లేని మార్గాల్లో విమానయానాన్ని వృద్ధి చేయాలన్న కేంద్రం సంకల్పం నెరవేరినట్లయ్యింది. గంట ప్రయాణానికి గరిష్ఠంగా రూ.2500ను కేంద్రం పరిమితం చేసిన సంగతి తెలిసిందే. సబ్సిడీగా అందిస్తున్న మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
 
ఏప్రిల్ 27న ప్రారంభమైన ఉడాన్ పథకం ప్రభావంతో వచ్చే 2-3 ఏళ్లలో దేశంలో వంద కొత్త విమానాశ్రయాలు ప్రారంభింసామని కేంద్ర పౌర విమానయా శాఖ సహయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీ పూర్తి సబ్సిడీతో కూడిన పౌరవిమానయానానికి తలుపులు తెరిచారు. సిమ్లానుంచి డిల్లీకి ఉడాన్ పథకాన్ని ఆవిష్కరించారు.
 
ఉదే దేశ్ కా అమ్ నాగరిక్ స్కీమ్ లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గంటకు రూ. 2,500లు చెల్లించి విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని దేశప్రజలకు కల్పించారు. విమానయానాన్ని సామాన్యులకు కూడా సులువుగా ఉండేలా చేయటమే ఈ పథకం లక్ష్యం. సిమ్లా నుంచి డిల్లీకి తొలి ప్లైట్‌కు టికెట్ ధరను రూ. 2,036లుగా నిర్ణయించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పప్పు అంటే తప్పేముంది? లోకేష్ కంటే జగన్ చాలా బెటర్...