Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీ మధురలో ఎస్పీని చంపేశారు... పోలీసులతో సహా 14 మంది మృతి, ప్రజలే కాల్చారు...

Advertiesment
Uttarpradesh
, శుక్రవారం, 3 జూన్ 2016 (13:29 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గురువారం రాత్రి పోలీసులపై స్థానికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎస్పీతో సహా 14 మంది మృతి చెందారు. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా జవహర్ బాగ్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన వందల ఎకరాల భూమి ఆక్రమణకు గురికావడంతో ఆజాద్ భారత్ విదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రాహి అనే మత సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమించింది. అయితే భూ ఆక్రమణలు తొలగించాలని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 
 
దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆక్రమణదారులను తరిమికొట్టడానికి రంగంలోకి దిగారు. ఆగ్రహం చెందిన 3 వేల మంది అక్రమ నిర్మాణదారులు .. పోలీసుల తీరుని ఖండిస్తూ వారిపై రాళ్ల వర్షం కురిపించి, అనంతరం కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకునేలోగానే ప్రాణనష్టం జరిగిపోయింది. స్థానికులు జరిపిన దాడిలో మధుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేదీతో పాటు నగరంలోని ఫరా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సంతోష్ కుమార్, మరో 12 మంది చనిపోయారు. 
 
50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో సగం మంది పోలీసులే ఉండటం సంచలనం సృష్టించింది. స్థానికుల ఏకధాటిగా దాడిచేయడంతో ఆలస్యంగా తేరుకున్న పోలీసులు ఆ తర్వాత పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దింపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నమ్మను కోర్కె తీర్చమన్న యువకుడు... చెబితే చంపేశారు...