Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

Advertiesment
child marriage

ఠాగూర్

, ఆదివారం, 5 జనవరి 2025 (14:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వధువు పెళ్లి పీటలపై నుంచి ఉడాయించింది. బూత్రూం వెళ్లాలని చెప్పి డబ్బు, నగలతో పారిపోయింది. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని వరుడు మీడియాకు వెల్లడించి వాపోయాడు. రూ.30 వేలు కమిషన్ ఇచ్చి రెండో పెళ్లి కుదుర్చుకున్నామని, చివరకు ఇలా అయిందంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఖాజ్ని ఏరియాకు చెందిన ఓ వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది. అయితే, భార్య చనిపోవడంతో మరో వివాహం చేసుకోవాలని ఇటీవల ప్రయత్నాలు చేపట్టాడు. మధ్యవర్తికి రూ.30 వేలు కమిషన్ ఇచ్చి ఓ సంబంధం కుదుర్చుకున్నాడు. వివాహ ఖర్చులు భరించడంతో పాటు వధువుకు పలు ఆభరణాలు చేయించేందుకు ఒప్పుకున్నాడు. అనుకున్న ముహూర్తానికి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేశాడు. దగ్గరి బంధువుల సమక్షంలో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. వధూవరులు ఇద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి పూజారి పెళ్లి తంతు నిర్వహిస్తున్నాడు.
 
ఇంతలో అర్జెంట్‌గా బాత్రూంకు వెళ్లాలని చెప్పి వధువు పీటల మీద నుంచి లేచింది. తల్లిని తోడుగా తీసుకుని బాత్రూం వైపు వెళ్లిన వధువు ఎంతకీ తిరిగిరాలేదు. ఏం జరిగిందని పెళ్లికొడుకు తరఫు బంధువులు వెళ్లి చూడగా.. బాత్రూం ఖాళీగా ఉండగా, వధువు ఎక్కడా కనిపించలేదు. దీంతో జరిగిన మోసం బయటపడింది. డబ్బు నగలతో వధువు పారిపోయిందని గుర్తించిన వరుడు మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకుందామని చూస్తే ఉన్నదంతా పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి రద్దీ : 52 అదనపు ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన ద.మ.రైల్వే