Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాలకు పనికిరాను... రాజీనామా చేస్తున్నా : ఎన్సీపీ ఎమ్మెల్యే

Advertiesment
రాజకీయాలకు పనికిరాను... రాజీనామా చేస్తున్నా : ఎన్సీపీ ఎమ్మెల్యే
, మంగళవారం, 31 డిశెంబరు 2019 (15:39 IST)
ప్రస్తుత రాజకీయాలకు తాను ఏమాత్రం పనికిరానంటూ మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి ప్రకటించారు. పైగా, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. బీద్ జిల్లా మజల్ గావ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
తన రాజీనామాపై ఆయన మంగళవారం మాట్లాడుతూ, 'మంగళవారం నేను రాజీనామా చేస్తాను. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని నేను ఎన్సీపీ నేతలకు కూడా తెలిపాను. స్పీకర్‌ను కలిసి నా రాజీనామా పత్రాన్ని అందిస్తా' అని చెప్పారు. 
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గాన్ని విస్తరించిన కొన్ని గంటలకే సోలంకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. పైగా, తన రాజీనామా నిర్ణయానికి, మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. 
 
అయితే.. కేబినెట్ విస్తరణ తాను రాజకీయాలకు అనర్హుడినని నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖ్యమంత్రి ఎడప్పాడికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సునీల్