Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఎయిర్ హోస్టెస్ భుజం తట్టింది... కేంద్రమంత్రి ప్రేమలో పడ్డాడు... 17 ఏళ్ల కుమార్తె.. ఏంటి కథ?

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో అర్థం కాదు. కానీ ప్రేమ పుట్టడానికి మాత్రం పేద-ధనిక అనే తేడా ఉండదు. అంతేకాదు... హోదాలు కూడా అడ్డురావు. ఇందుకు తాజాగా ఓ కేంద్రమంత్రి ప్రేమ వ్యవహారమే నిదర్శనం. వివరాల్లోకి వెళ

Advertiesment
Babul Supriyo
, గురువారం, 16 జూన్ 2016 (17:32 IST)
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో అర్థం కాదు. కానీ ప్రేమ పుట్టడానికి మాత్రం పేద-ధనిక అనే తేడా ఉండదు. అంతేకాదు... హోదాలు కూడా అడ్డురావు. ఇందుకు తాజాగా ఓ కేంద్రమంత్రి ప్రేమ వ్యవహారమే నిదర్శనం. వివరాల్లోకి వెళితే... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ మంత్రిమండలిలోని బాబుల్ సుప్రీయో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసే అమ్మాయి ప్రేమలో పడ్డారు. అంతేకాదు... ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎయిర్ హోస్టెస్ రచన శర్మను తొలిచూపులోనే ప్రేమించేశానని చెపుతున్నారు మంత్రిగారు. 
 
ఇంతకీ తొలిచూపు ప్రేమ ఎక్కడ... ఎలా అని అడిగితే ఆయన ఇలా చెప్పుకొచ్చారు. గత 2014లో యోగా గురువు రాందేవ్‌ బాబాతో కలిసి నేను విమాన ప్రయాణం చేస్తున్నాను. అప్పుడు నా ఎంపీ సీటు అభ్యర్థిత్వంపైన మాట్లాడుకుంటున్నాం. అలా మేము మాట్లాడుకుంటూ ఉండగా... ఆ విమానంలో ఉన్న ఎయిర్‌హౌస్టెస్‌ రచన నా మాటలు విన్నారు. నా వద్దకు వచ్చి సీటు వస్తే తప్పకుండా గెలుస్తారని భుజం తట్టారు. ఆనాడు ఆమె నా భుజం తట్టడంతోనే నేను ప్రేమలో పడిపోయా. ఆగస్టు 9న ఆమెను పెళ్లాడుబోతున్నా" అని చెప్పారు.
 
ఇకపోతే ఈయన కేంద్రమంత్రి కాకమునుపు బాలీవుడ్ ఇండస్ట్రీలో గాయకుడు. సుమారు 17 సినిమాలకు నేపధ్య గాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలో అతడికి రియా పరిచయమైంది. 1995లో షారుక్ ఖాన్‌తో కలిసి టొరొంటోలో కచేరి ఇస్తున్న సమయంలో ఆమెతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1999లో వారికి షర్మిలి అనే కుమార్తె జన్మించింది. ఇపుడామెకు 17 సంవత్సరాలు. కాగా... ఏవో మనస్పర్థలతో రియాకు 2015లో విడాకులిచ్చాడు సుప్రియో. ఇపుడు 2014లో ప్రేమలో పడిన ఎయిర్ హోస్టెస్ రచనను 2016 ఆగస్టు నెలలో పెళ్లాడబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైపూర్‌లో దారుణం.. ఈ వీడియో చూస్తే భయంతో నిర్ఘాంతపోతారు... ధైర్యం ఉన్నవారే చూడండి!