Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీలో కేంద్ర మహిళా మంత్రికి ఈవ్‌టీజింగ్ తిప్పలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ మహిళలకే కాదు కేంద్రంలోని మహిళా మంత్రులకు సైతం రక్షణ లేదని తెలుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌‌ కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. ఆమె తన సొంత నియోజకవర్గ

Advertiesment
యూపీలో కేంద్ర మహిళా మంత్రికి ఈవ్‌టీజింగ్ తిప్పలు
, మంగళవారం, 12 జూన్ 2018 (16:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ మహిళలకే కాదు కేంద్రంలోని మహిళా మంత్రులకు సైతం రక్షణ లేదని తెలుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌‌ కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. ఆమె తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వారణాసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


ఈ వివరాలను పరిశీలిస్తే... కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనుప్రియ యూపీలోని ఔరాయ్, మీర్జామురాద్ అనే ప్రాంతాల మధ్య కారులో ప్రయాణిస్తుండగా ముగ్గురు దుండగులు తనును వేధించినట్లు ఆమె ఆ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంబరు ప్లేట్‌లేని కారులో వచ్చిన ఈ దుండగులు తన వాహనశ్రేణిని దాటేందుకు ప్రయత్నిస్తూ, తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, తన భద్రతా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. 
 
మంత్రి అనుప్రియా పటేల్ ఈ ఫిర్యాదును వారణాసి ఏఎస్పీ ఆర్‌.కె. భరద్వాజ్‌కు సమర్పించారు. భరద్వాజ్ తక్షణమే స్పందించి, నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. మీర్జామురాద్ పోలీసులు ఈ దుండగులను అరెస్టు చేసి, వారి కారును స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నాడు.. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.. ఎవరు?