కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 26రకాల మందులపై కేంద్రం వేటు వేసింది. అత్యవసర జాబితా నుంచి ర్యాంటాక్, జింటాక్ ట్యాబ్లెట్లను తొలగించింది.
ర్యాంటాక్, జింటాక్ మందుల్ని ఎసిడిటీ వంటి సమస్యలకు వైద్యులు సూచిస్తుంటారు. ఈ ట్యాబ్లెట్లతో కేన్సర్ సోకుతుందనే అనుమానాల్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యక్తపరిచింది.
ర్యాంటాక్, జింటాక్‌లతో పాటు 26 రకాల మందుల్ని ఇండియన్ మార్కెట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలతో కొత్తగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ విడుదల చేసి..26 ఔషధాల్ని తొలగించింది.