Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్ర బడ్జెట్ 2024: తగ్గనున్న మొబైల్స్ ధరలు.. చౌకగా క్యాన్సర్ మందులు

Union Budget 2024

సెల్వి

, మంగళవారం, 23 జులై 2024 (15:20 IST)
Union Budget 2024
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్‌లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో, మార్కెట్‌లో వాటి ధరలను గణనీయంగా తగ్గనున్నాయి.  మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే క్యాన్సర్ చికిత్స ఔషధాలను ప్రభుత్వం కస్టమ్స్ సుంకం నుండి మినహాయిస్తుంది. ఇందులో భాగంగా క్యాన్సర్ మందులు ట్రాస్టూజుమాబ్ డెరక్స్టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్‌లు తగ్గనున్నాయి. 
 
అలాగే బడ్జెట్ ప్రకటన కారణంగా మొబైల్ ఫోన్‌లు, దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, తోలు వస్తువులు, సముద్రపు ఆహారాలు చౌకగా మారనున్నాయి. బంగారం, వెండిపై సుంకాలు 6 శాతం తగ్గింపు రిటైల్ డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుంది. 
 
ఇంకా ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీలను 6.5 శాతం తగ్గించాలని, రొయ్యలు,  చేపల మేతతో కూడిన సీఫుడ్‌పై 5 శాతం తగ్గింపును ప్రతిపాదించారు విత్తమంత్రి సీతారామన్. జీతభత్యాల తరగతికి, ఆర్థిక మంత్రి 4 కోట్ల మందికి పైగా జీతభత్యాల కోసం పన్ను మినహాయింపులను ప్రకటించారు.
 
కొత్త పన్ను విధానంలో ఉన్నవారికి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిలో రూ.50,000 నుంచి రూ.75,000కి సడలింపు ఇవ్వగా, పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్‌పై మినహాయింపు రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచారు. దీనివల్ల దాదాపు నాలుగు కోట్ల మంది జీతభత్యాలు, పెన్షనర్లకు ఉపశమనం లభిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర వార్షిక బడ్జెట్ : ధరలు తగ్గే వస్తువులు... పెరిగే వస్తువులివే..