Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిట్టింగ్ ఎంపీ కన్నుమూత... బడ్జెట్ వాయిదాపడే ఛాన్సెస్

కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ ఇ.అహ్మద్ కన్నుమూశారు. దీంతో పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ వాయిదాపడే అవకాశం ఉంది. ఆనవాయితీ ప్రకారం సిట్టింగ్ ఎంపీ మరణిస్తే బడ్జెట్‌ను వాయిదా వేయడం

Advertiesment
సిట్టింగ్ ఎంపీ కన్నుమూత... బడ్జెట్ వాయిదాపడే ఛాన్సెస్
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (08:49 IST)
కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ ఇ.అహ్మద్ కన్నుమూశారు. దీంతో పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ వాయిదాపడే అవకాశం ఉంది. ఆనవాయితీ ప్రకారం సిట్టింగ్ ఎంపీ మరణిస్తే బడ్జెట్‌ను వాయిదా వేయడం సంప్రదాయం. అందువల్ల విత్త మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సందేహాలు నెలకొన్నాయి.
 
పార్ల‌మెంట్‌లో మంగ‌ళ‌వారం రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో గుండెపోటుకు గురై స‌భ‌లోనే కుప్ప‌కూలిన మాజీ మంత్రి, ఐయూఎంఎల్ ఎంపీ ఇ.అహ్మ‌ద్‌(78) ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని రామ్‌మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న బుధవార మృతి చెందారు. 
 
రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న స‌మ‌యంలో వెనుక వ‌రుస‌లో కూర్చున్న అహ్మ‌ద్ ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. స్పృహ‌త‌ప్పి ప‌డిపోయిన ఎంపీకి రాష్ట్ర‌ప‌తి వైద్య బృందం ప్రాథ‌మిక చికిత్స అందించి ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. అక్క‌డ చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో క‌న్నుమూశారు. మ‌న్మోహ‌న్‌ ప్ర‌భుత్వ హాయంలో అహ్మ‌ద్ విదేశాంగ‌, రైల్వేశాఖ స‌హాయ‌మంత్రిగా ప‌ని చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా వెల్లడి... ఏపీపై వరాల వర్షం కురిపించేనా?