Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రైస్తవుడని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది : డిప్యూటీ సీఎం ఉదయనిధి

Advertiesment
Udhayanidhi Stalin

ఠాగూర్

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (15:46 IST)
తాను క్రైస్తవుడని, ఈ విషయాన్ని చెప్పుకునేందుకు గర్వంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు  ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తాను క్రైస్తవుడుని అయినప్పటికీ అన్ని మతాలు తనకు సమ్మతమేనని వ్యాఖ్యానించారు. క్రైస్తవులు, ముస్లింలు డీఎంకేకు మద్దతుగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. 
 
ప్రజలు తనను క్రైస్తవుడిగా భావిస్తే తాను క్రైస్తవుడినని, ముస్లింగా భావిస్తే ముస్లింనని, హిందువుగా భావిస్తే హిందువునని ఆయన చెప్పారు. అన్ని మతాలు తనకు సమ్మతమేనని అన్నారు. క్రిస్మస్ అంటే తనకు చాలా ఇష్టమని... క్రైస్తవుడినని చెప్పుకునేందుకు తాను ఎంతగానో గర్వపడుతున్నానని చెప్పారు. గత యేడాది కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నట్టు చెప్పారు. ఈ యేడాది క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తానొక క్రైస్తవుడినని చెపితే... తమ రాజకీయ ప్రత్యర్థులకు కడుపుమంటగా మారిందన్నారు. 
 
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయనిధి మండిపడ్డారు. ఆ న్యాయమూర్తిని తొలగించే బిల్లుకు డీఎంకే, ఇండియా కూటమి ఎంపీలు మద్దతు ప్రకటిస్తే.. అన్నాడీఎంకే మద్దతు ప్రకటించకుండా మౌనంగా ఉంటూ ద్వంద్వ వైఖరిని అవలంభించిందని విమర్శించారు. క్రైస్తవులు, ముస్లింలు ఎప్పుడూ డీఎంకేకు మద్దతుగా ఉంటారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!