Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరులో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: సినీ ఫక్కీలో సీక్రెట్ డోర్‌.. లోపలికి వెళ్తే..?!

Advertiesment
Two years
, మంగళవారం, 10 మే 2016 (14:20 IST)
బెంగళూరులో వెలుగు చూసిన ఓ సీక్రెట్ సెక్స్ రాకెట్ పోలీసులకే షాక్ ఇచ్చింది. అక్కడ జరుగుతున్న తంతు చూసి వారికి ముక్కుపై వేలేశారు. సెక్స్ రాకెట్ నిర్వాహకుల మెదడుకి విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్‌కు సమీపంలోనే శివ ప్యాలెస్ డీలక్స్ లాడ్జ్ ఉంది. వేర్వేరు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఆ లాడ్జ్‌లో వ్యభిచారం నడుపుతున్నారని రెండేళ్లుగా ఆరోపణలు వచ్చాయి. 
 
కాని ఈ ఆరోపణల చేత పోలీసులు దాదాపు ఆరు సార్లు తనిఖీలు చేపట్టారు. హోటల్లో మూలమూలలు తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి ఆధారం చిక్కలేదు. పక్కా సమాచారం ఉన్నప్పటికీ, సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేయలేకపోయారు. అయితే అదే లాడ్జిపై తరుచుగా వ్యభిచార ఆరోపణలు వస్తుండటంతో ఏడోసారి తనిఖీలకు వెళ్లిన పోలీసులు.. క్లూని ఛేదించగలిగారు. అక్కడ జరుగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్‌ను చూసి పోలీసులు ఖంగుతిన్నారు. హోటల్కు తనిఖీకి వెళ్లిన ఓ తెలివైన పోలీస్ ఇన్స్పెక్టర్ హోటల్ను అదేపనిగా పరిశీలించారు. 
 
హోటల్లోని గోడలను చూపులు తిప్పకుండా గంటల కొద్దీ తదేకంగా చూశారు. ఆ హోటల్లో రహస్యంగా ఓ ఫ్లోర్ ఉన్నట్టు అనుమానం వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్, సెకెంట్ ఫ్లోర్కు మధ్యలో సీక్రెట్ డోర్ ఉన్నట్టు కనిపెట్టారు. డోర్ను తెరిచి చూస్తే తక్కువ ఎత్తులో ఓ ఫ్లోర్ వారికి కనిపించింది. ఆ కొంతగ్యాప్‌లోనే సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. దాన్ని తెరచి చూస్తే, అక్కడ తక్కువ ఎత్తులో ఉన్న ఫ్లోర్, కొన్ని గదులు, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు దారి ఉంది. దీంతో విస్మయం చెందిన పోలీసులు కాల్ గర్ల్ రాకెట్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
 
హోటల్ బయట నుంచి కానీ లోపల నుంచి చూస్తే ఈ ఫ్లోరే ఉన్నట్టు కనిపించదని పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని గ్రౌండ్ ఫ్లోర్లో రిటైల్ షాపు నడుపుతున్నాడు. దీంతో కస్టమర్లు వచ్చినా, వెళ్లినా ఎవరికీ అనుమానం వచ్చేది కాదని పోలీసులు పేర్కొన్నారు. బీహార్, బెంగాల్ అమ్మాయిలతో పాటు, సెక్స్ రాకెట్ నిర్వాహకులనూ అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్మనీ మ్యునిచ్ రైల్వేస్టేషన్‌లో ఉగ్ర సంచారం.. అల్లాహో అక్బర్ అంటూ కత్తితో దాడి!