కేరళ రాష్ట్రంలో ఘోరం జరిగింది. నేవీ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు నౌకాదళ అధికారులు మృతిచెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా ఆదివారం ఉదయం ఐఎన్ఎస్ గరుడ నుంచి బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కొచ్చిలోని నావెల్ బేస్ సమీపంలో ఉన్న తొప్పంపాడి బ్రిడ్జి వద్ద కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో అందులో ఉన్న నేవీ అధికారులు లెఫ్టినెంట్ రాజీవ్ ఝా (39), పెట్టీ ఆఫీసర్ సునీల్ కుమార్ (29) అక్కడిక్కడే మరణించారు. ప్రమాద ఘటనపై నౌకాదళ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రాజీవ్ ఝా ఉత్తరాఖండ్‌కు చెందినవారు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సునీల్ కుమార్ స్వస్థలం బీహార్. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. కాగా, రెండు రోజుల క్రితం కర్ణాటకలోని కర్వార్ ప్రాంతంలో శిక్షణ విమానం కూలింది. విమానం సముద్రంలో పడిపోవడంతో ఓ అధికారి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.