Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారు దిగి ఫోటో తీశారు... తరుముకున్న పెద్ద ఏనుగు.. చుక్కలు కనిపించాయ్

elephant attack

సెల్వి

, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (15:52 IST)
elephant attack
కేరళ సరిహద్దులోని జాతీయ రహదారిపై అడవి ఏనుగు నుంచి ఇద్దరు పర్యాటకులు తప్పించుకున్న షాకింగ్ తతంగాన్ని  మరో వాహనంలో ప్రయాణిస్తున్న ఓ పర్యాటకుడు వీడియో తీశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. గురువారం సాయంత్రం కేరళ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కారులో వచ్చిన కొందరు పర్యాటకులను ఏనుగు తరుముకుంది. 
 
కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైకి దిగి ఏనుగులను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో అది కాస్త తిరగబడి చుక్కలు చూపించింది. కారులో వచ్చిన వ్యక్తులు కారును వేగంగా నడిపేందుకు ప్రయత్నించడంతో రోడ్డుపై నిల్చున్న వ్యక్తులను ఏనుగు వెంబడించింది. ఏనుగు దగ్గరలో  వెంబడించడంతో ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఒక్కసారిగా ఏనుగు అతడిని తొక్కేసింది.
 
అంతలో ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ హారన్ మోగించడంతో ఏనుగు ఆ వ్యక్తిని వదిలి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఏనుగు తొక్కిసలాటకు గురైన వ్యక్తి కాలికి స్వల్ప గాయం అయ్యింది. ఈ వీడియోను కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లా మనందవాడి ప్రాంతానికి చెందిన సబతు తన కారులోంచి తీశాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న అతడు సెలవుపై వచ్చి ముత్తంగ అభయారణ్యం మీదుగా కారులో భార్యాపిల్లలతో కుండల్‌పేట, మైసూర్‌ వెళ్లి అక్కడి నుంచి మసినగుడి, ఊటీ వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాడు.
 
అప్పుడే అడవి ఏనుగును చూసి కారులోంచి వీడియో తీశాడు. ఈ ఘటనను చూసి ఆటోలో ఉన్న భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏనుగు పట్టుబడిన వ్యక్తులు ఆంధ్రా రాష్ట్రానికి చెందిన పర్యాటకులుగా చెబుతున్నారు. పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు, రక్షిత అటవీ ప్రాంతాల్లో వాహనాల నుంచి దిగి వన్యప్రాణులకు అంతరాయం కలిగించడం నేరమని, ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలకు పాల్పడవద్దని అటవీశాఖ పలు రకాలుగా హెచ్చరిస్తూనే వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం పనిచేయదా?