Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్న టిటివి దినకరన్..!

తమ వారికి ఒకటి పోతే ఒక సమస్య వస్తుంటే.. ఒరేయ్.. నీకు యేలినాటి శని పట్టిందిరోయ్.. ఇప్పట్లో వదలదు.. ఆలయంలో పూజలు చేయించుకో.. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేయి.. నీకు తొందరలోనే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితినే ఇప్పుడు తమిళనాడులో శశికళ మ

Advertiesment
శనిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్న టిటివి దినకరన్..!
, గురువారం, 21 సెప్టెంబరు 2017 (20:04 IST)
తమ వారికి ఒకటి పోతే ఒక సమస్య వస్తుంటే.. ఒరేయ్.. నీకు యేలినాటి శని పట్టిందిరోయ్.. ఇప్పట్లో వదలదు.. ఆలయంలో పూజలు చేయించుకో.. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేయి.. నీకు తొందరలోనే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితినే ఇప్పుడు తమిళనాడులో శశికళ మేనల్లుడు దినకరన్ ఎదుర్కొంటున్నారు. దెబ్బ మీద దెబ్బ తగులుతూ లేవలేని స్థితిలోకి దినకరన్ వెళ్ళిపోతున్నారు. కారణం పళనిస్వామి, పన్నీరుసెల్వం వేస్తున్న ఎత్తుకు పైఎత్తులే. 
 
ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన దినకరన్‌కు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. తన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం.. కోర్టు తీర్పు వచ్చేంత వరకు అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టకూడదంటూ తీర్పు రావడం ఇదంతా దినకరన్‌ను తీవ్ర నిరాశలోకి తీసుకెళ్ళిపోతోంది. ఎలాగైనా పళణిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న దినకరన్‌కు అది ఏమాత్రం సాధ్యం కావడం లేదు. 
 
ఒకవైపు కేంద్రం పూర్తిస్థాయిలో పళణిస్వామి ప్రభుత్వానికి వెనుక నుంచి సపోర్ట్ చేస్తుండగా ఇంకోవైపు పన్నీరుసెల్వం వ్యూహాలతో ప్రభుత్వం గట్టెక్కి సాఫీగా సాగుతోంది. అక్టోబర్ 4వ తేదీన వచ్చే తీర్పు వరకు అసెంబ్లీలో ఎలాంటి విశ్వాస పరీక్షలు నిర్వహించకూడదని హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. దీంతో దినకరన్ లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాజాగా ఆయన వర్గంగా చెబుతున్న ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతుండటంతో వాళ్లంతా దిక్కుతోచక లబోదిబోమంటున్నారట. దీనితో దినకరన్ పరిస్థితిని గమనిస్తున్న కొంతమంది జ్యోతిష్యులు ఆయన శనిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నారంటూ చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూచ్... రాజీనామాపై వెనక్కి తగ్గిన ఎంపీ జేసీ దివాకర్