Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన్వీర్ సేఠ్ ఫోన్‌లో చూసిన బూతు బొమ్మలు ఎవరివో తెలుసా? ట్రంప్ భార్యవి..!

టిప్పు సూల్తాన్ జయంతి సందర్భంగా తన సెల్ ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూస్తూ మీడియాకి కంటికి కర్ణాటక మంత్రి తన్వీర్ సేఠ్ చిక్కారు. తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయిన తన్వీర్ సేఠ్.. మొబైల్‌ ఫోన్‌‌లో

Advertiesment
Trump
, బుధవారం, 16 నవంబరు 2016 (11:38 IST)
టిప్పు సూల్తాన్ జయంతి సందర్భంగా తన సెల్ ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూస్తూ మీడియాకి కంటికి కర్ణాటక మంత్రి తన్వీర్ సేఠ్ చిక్కారు. తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయిన తన్వీర్ సేఠ్.. మొబైల్‌ ఫోన్‌‌లో బూతుబొమ్మలు చూస్తూ మంత్రి మీడియాకు దొరికిపోయారు. కానీ అంతగా ఆసక్తిగా వీక్షించిన ఫొటోలు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియాకు చెందినవని వెల్లడైంది. 
 
మెలానియా మోడలింగ్‌ చేసినప్పటి ఫొటోలను చూస్తూ తన్వీర్‌ సేఠ్‌ కెమెరా కంటపడడంతో విమర్శలు చెలరేగాయి. ట్రంప్‌ విజయం సాధించడంతో మెలానియా పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విరివిరిగా పోస్ట్‌ అవుతున్నాయి. ట్రంప్‌‌ను​ పెళ్లాడకముందు మెలానియా మోడలింగ్‌ చేశారు. తన్వీర్‌ సేఠ్‌ తన మొబైల్‌ ఫోన్‌‌లో మెలానియా ఫొటోలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్‌తో పాటు కెమెరామెన్‌పై మంత్రి తన్వీర్‌ సేఠ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన్వీర్‌ సేఠ్‌‌ను కర్ణాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వివరణ అడిగారు. మంత్రి తప్పు చేసినట్లు తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భార్య ఫోటోలను అదే పనిగా చూస్తుండిపోయిన మంత్రిగారికి పదవి ఉంటుందా.. ఊడుతుందా అనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైకోర్టు గడపకెక్కిన తిరుమల ధరల పంచాయతీ...