Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గే' లను కూడా మార్చేస్తారా బాబా గారూ, మీవల్ల కాదులెండి అంటున్న హిజ్రా

మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చే ప్రతి కంపెనీ చేసేది ప్రజలను తిమ్మిని బమ్మిని చేసి మాయచేసి ఏదో ఒకరకంగా తమ వస్తువును కొనేలా చేయడమే కదా. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న బాబా రామ్ దేవ్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే తిన్నట్లున్నారు కానీ లింగమ

Advertiesment
'గే' లను కూడా మార్చేస్తారా బాబా గారూ, మీవల్ల కాదులెండి అంటున్న హిజ్రా
హైదరాబాద్ , బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (05:48 IST)
మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చే ప్రతి కంపెనీ చేసేది ప్రజలను తిమ్మిని బమ్మిని చేసి మాయచేసి ఏదో ఒకరకంగా తమ వస్తువును కొనేలా చేయడమే కదా. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న బాబా రామ్ దేవ్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే తిన్నట్లున్నారు కానీ లింగమార్పిడి చేసుకున్న ఒక మహిళ మాత్రం ఇటీవల బాబా రామ్ దేవ్‌కి జలక్ ఇచ్చింది. 
 
మరి బాబాగారు చేసింది మామూలు ప్రకటనా.. బట్టతలమీద జుత్తు మొలిపిస్తా. అమృతాన్ని తెచ్చి మీ ఇంటి ముందే నిలుపుతా వంటి ప్రమోషన్లు అయితే ఎలాగోలా నడిచేది. కాని మన బాబాగారు గే లనే మార్చి పడేస్తానని గొప్పలు చెప్పుకోవడంతో నీవల్ల కాదు లే పోవోయ్ అన్నట్లుగా ఒక రేంజిలో తిరస్కరించిందా నిజమైన గే. 
 
విషయానికి వస్తే లాక్మె ఫ్యాషన్ వీక్‌‌ ర్యాంప్‌పై నడిచిన తొలి ట్రాన్స్‌జండర్ అంజలి లామా గురించి అందరికీ తెలుసు. నేపాల్‌కు చెందిన 32 ఏళ్ల అంజలి లింగమార్పిడి చేయించుకుని మోడల్‌గా మారింది. ఆర్థిక స్తోమత లేమి కారణంగా ఖరీదైన బ్యూటీ బ్రాండ్స్ కొనలేనని చెబుతున్న అంజలికి తక్కువ ధరకు దొరికే పతంజలి ఉత్పత్తులు అంటే ఇష్టమట.
 
పతంజలి ఉత్పత్తులను ఇష్టంగా కొనుక్కుని వాడే అంజలి యోగా గురు రామ్‌దేవ్ తాజా ప్రకటనపై అంజలి ఘాటుగానే స్పందించింది. ‘నేను కూడా విన్నాను. ‘గే’లను మార్చేయగలనని ఆయన (రామ్‌దేవ్) చెబుతున్నారట. ఆయన ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ అది ఎప్పటికీ జరగదు. అది ఆయన వల్ల కాదు’ అని అంజలి స్పష్టం చేసింది. 
 
ఎంతటి బాబాలైనా కొన్ని పనులు చేయలేరని తన అనభవ జ్ఞానంతో తేల్చి పడేసిన  అంజలి రామ్ దేవ్‌కు మాత్రం నిజంగానే షాక్ తెప్పించింది మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాణి నుంచి మహాజనుల వరకు అందరి ద్వేషాన్ని చూరగొంటున్న మహానేత ట్రంప్