Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమాన పైలట్లలోనూ ఇంత చీఫ్ మెంటాలిటీనా... టేకాఫ్‌కు ఇలా వంకలు చెబుతారా?

విమానం నడుపుతూ అలాగే నిద్రపోయే పైలట్ల గురించి విన్నా. అధికారులతో చిన్న పాటి గొడవలు పెట్టుకుని డ్యూటీకి రాకుండా చెక్కేసి ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పైలట్లనూ చూశాం. ఎవడిమీద కోపాన్నో విమానం మీదికి మళ్లించి నడుపుతున్న విమానాన్ని అలాగే హైజాక్ చ

విమాన పైలట్లలోనూ ఇంత చీఫ్ మెంటాలిటీనా... టేకాఫ్‌కు ఇలా వంకలు చెబుతారా?
హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (05:09 IST)
విమానం నడుపుతూ అలాగే నిద్రపోయే పైలట్ల గురించి విన్నా. అధికారులతో చిన్న పాటి గొడవలు పెట్టుకుని డ్యూటీకి రాకుండా చెక్కేసి ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పైలట్లనూ చూశాం. ఎవడిమీద కోపాన్నో విమానం మీదికి మళ్లించి నడుపుతున్న విమానాన్ని అలాగే హైజాక్ చేసి సముద్రంలో ముంచేసిన పైలట్లనూ చూశాం. కాని అడలేక మద్దెలోడు అన్నట్లుగా తనలో లోపం పెట్టుకుని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇవ్వలేదు ఎలా విమానం నడిపేది అంటూ జాప్యం చేసిన పైలట్లు కూడా ఉన్నారని ఇప్పుడే తెలుస్తోంది. 
 
విమానాలు ఆలస్యం కావడం ఆరుదు. అలా లేటైనప్పుడు అందుకు కారణం ఏంటని ప్రయాణికులు గట్టిగానే నిలదీస్తారు. అలాగే ప్రయాణికులు నిలదీస్తుంటే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి ఇవ్వలేదని వంక చెప్పేందుకు ప్రయత్నించిన ఇండిగో విమాన పైలట్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. 
 
ఏటీసీ తప్పు ఏమీ లేకపోయినా.. దానిమీదకు తోసేయడంపై ఇండిగో విమానయాన సంస్థను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయొద్దని స్పష్టం చేసింది. దాంతో ఇండిగో సంస్థ తన పైలట్లందరికీ ఓ ఈమెయిల్ పంపింది. ఇలాంటి పనులకు పాల్పడొద్దని అందులో గట్టిగానే చెప్పింది.
 
చెన్నై నుంచి మదురై మార్గంలో వెళ్లాల్సిన 6ఇ-859 విమానం 11.45కి బయల్దేరాల్సి ఉండగా, దాన్ని 12.25కి రీషెడ్యూల్ చేశారు. ఆ విషయమై ప్రయాణికులకు ఎస్ఎంఎస్‌లు పంపారు. విమాన డిపార్చర్‌కు ఏటీసీ నుంచి అనుమతి రాలేదని పైలట్ తెలిపాడు. అయితే.. ప్రయాణికుల్లో ఒక ఏటీసీ అధికారి కూడా ఉన్న విషయం సదరు పైలట్‌కు తెలియదు. ఆయన వెంటనే చెన్నై ఏటీసీకి ఫోన్ చేసి విషయం ఏంటని అడిగారు. కానీ, వాళ్లు అసలు తమవైపు నుంచి సమస్య ఏమీ లేదని చెప్పడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. 
 
పైలట్ ఆ విషయం చెప్పే సమయానికి కాక్‌పిట్‌లో కో పైలట్ కూడా లేరు. ఆ తర్వాత తాను చెప్పిన అబద్ధానికి సదరు పైలట్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కో పైలట్ రాకపోవడం వల్లే విమానం ఆలస్యం అయ్యిందని తెలిపారు. అయితే.. తమ విమానం కేవలం మూడు నిమిషాలే ఆలస్యం అయ్యిందని ఇండిగో తెలిపింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలా రెచ్చగొట్టేవాళ్లుంటే ట్రంప్ ఇంకా రెచ్చిపోడా.. ఇక విదేశీ విమానాలూ టార్గెట్టే మరి!