Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇలా రెచ్చగొట్టేవాళ్లుంటే ట్రంప్ ఇంకా రెచ్చిపోడా.. ఇక విదేశీ విమానాలూ టార్గెట్టే మరి!

ఇన్నాళ్లూ అక్రమ వలసదారులంటూ మనుషుల మీదే గురిపెట్టి ట్రంప్ ఇజం ఇప్పుడు విదేశీ విమానాలపైనా గురిపెట్టడానికి సిద్ధమైంది. ఆ విదేశీ విమానాన్ని అడ్జుకోకుంటే అమెరికన్ విమానయాన సంస్థలు మటాష్ అవుతాయంటూ అమెరికన్ కాంగ్రెస్ నేతలు స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్

ఇలా రెచ్చగొట్టేవాళ్లుంటే ట్రంప్ ఇంకా రెచ్చిపోడా.. ఇక విదేశీ విమానాలూ టార్గెట్టే మరి!
హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (04:34 IST)
ఇన్నాళ్లూ అక్రమ వలసదారులంటూ మనుషుల మీదే గురిపెట్టి ట్రంప్ ఇజం ఇప్పుడు విదేశీ విమానాలపైనా గురిపెట్టడానికి సిద్ధమైంది. ఆ విదేశీ విమానాన్ని అడ్జుకోకుంటే అమెరికన్ విమానయాన సంస్థలు మటాష్ అవుతాయంటూ అమెరికన్ కాంగ్రెస్ నేతలు స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యేకించి ఉత్తరం రాశారంటే అమెరికా ఎంత స్వీయ రక్షణ విధానాలకు పట్టం గడుతోందో అర్థమవుతుంది. 
 
విషయం ఏమిటంటే .. ‘అధ్యక్షా.. ఆ విమానాన్ని వెంటనే ఆపేసేలా చర్యలు తీసుకోండి. లేకుంటే మీ హామీకి మీరే తూట్లుపొడిచిన వారవుతారు’.. అంటూ న్యూయార్క్, న్యూజెర్సీకి చెందిన దాదాపు 25 మంది కాంగ్రెస్‌ నేతలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఓ విమాన సర్వీసును ఆపేయించేందుకు వీళ్లంతా మూకుమ్మడిగా లేఖాస్త్రం సంధించారు. ట్రంప్ హామీని గుర్తు చేస్తూనే... అమెరికన్ల ప్రయోజనాలను కాపాడండంటూ విన్నవించుకున్నారు. 
 
నెవార్క్, న్యూజెర్సీ, ఏంథీన్స్ మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసును ఎమిరేట్ ఎయిర్‌లైన్స్ ఆదివారం నుంచి ప్రారంభించబోతోంది. యూఏఈకి చెందిన ఈ ఎయిర్‌లైన్స్ వల్ల స్థానిక విమానయాన సంస్థలు భారీగా నష్టపోతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఎమిరేట్, ఖతర్, ఎథియాడ్ వంటి గల్ఫ్ దేశాల విమానయాన సంస్థలు... అమెరికా నుంచి భారీగా రాయితీలను పొందుతూ తక్కువ ధరలకే సర్వీసులను అందిస్తున్నాయన్నారు. తద్వారా విమాన ప్రయాణీకులు ఈ సంస్థల సర్వీసులనే ఉపయోగిస్తున్నారని తెలిపారు. 
 
ఈ విమానాశ్రయ సంస్థల్లో పని చేసే వారు కూడా గల్ఫ్ దేశాలకు చెందిన వారేనన్నారు. 2004 నుంచి నేటి వరకూ దాదాపు 50 బిలియన్ డాలర్ల మేర ఈ ఎయిర్‌లైన్స్ అమెరికా నుంచి లాభాలను ఆర్జించాయన్నారు. ఈ డబ్బుతో ఎంతో మంది అమెరికన్లకు ఉద్యోగ కల్పన జరిగేదన్నారు. ఇకనైనా ఈ సంస్థలకు అడ్డుచెప్పకపోతే ‘అమెరికా ఫస్ట్’ అనే మీ నినాదం వృథా అవుతుందని ట్రంప్‌కు తేల్చి చెప్పారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో కోడెల తర్వాతే ఎవరైనా.. నోటి దురద మరి..