Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

Advertiesment
PM Narendra Modi

ఐవీఆర్

, బుధవారం, 15 అక్టోబరు 2025 (18:33 IST)
అక్టోబర్ 16న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇలా పేర్కొన్నారు. రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి అని వెల్లడించారు.
 
Vizag లోని G కాస్త Googleగా నిలబడింది: చంద్రబాబు
వైజాగ్ నగరంలో Google AI hub కేంద్రాన్ని తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. Vizag లోని G కాస్త Googleగా నిలబడింది అంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు డైనమిక్ నగరమైన విశాఖపట్నంలో గూగుల్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గిగా-వాట్-స్కేల్ డేటా సెంటర్‌లను కలిగి ఉన్న ఈ పెట్టుబడి అభివృద్ధి చెందిన భారతదేశం వృద్ధికి ఎంతో దోహదపడుతుందని ప్రధాని అన్నారు. 
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, విశాఖపట్నంలోని ఈ సౌకర్యం ప్రతి పౌరుడికి అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. గూగుల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏఐని బలోపేతం చేసేందుకు విశాఖలో హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రధాని అన్నారు. ఇది భారతీయ పౌరులను అధునాతన డిజిటల్ సాధనాలతో సన్నద్ధం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి ప్రయత్నాలు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంచుతూనే సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేస్తాయని మోదీ పునరుద్ఘాటించారు. 
 
భారతదేశ సాంకేతిక ప్రయాణంలో విశాఖపట్నం AI హబ్ ఒక మైలురాయి ప్రాజెక్టు అని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రశంసించారు. దీనిపై ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని, భారతదేశంలో మొట్టమొదటి ఏఐ హబ్ కోసం గూగుల్ ప్రణాళికలను వివరించారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్