నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం.. దక్షిణ భారతీయులతో జీవిస్తున్నాం.. ఇంకెక్కడ వివక్ష?
భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గమని.. భారత దేశంలో జాతివివక్ష లేదంటూ.. బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తామని.. మాకే తనుక జాతివివక్
భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గమని.. భారత దేశంలో జాతివివక్ష లేదంటూ.. బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తామని.. మాకే తనుక జాతివివక్ష ఉంటే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తామని ప్రశ్నించారు. ఇలా దక్షిణ భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం విమర్శలకు దారితీశాయి.
కాగా ఇద్దరు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో జరిగిన దాడిపై 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. దక్షిణ భారతీయులతో తాము కలిసి జీవిస్తున్నామని.. అలాంటప్పుడు భారత్‌లో జాత్యంహకారులు ఎక్కడు ఉన్నారని ప్రశ్నించారు.
తమలోనూ, తమ చుట్టూ నల్లజాతీయులు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. వివిధ వర్గాల వారున్నప్పటికీ.. దేశంలో జాత్యహంకారం లేదన్నారు. అయితే తరుణ్ విజయ్ వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. భారత దేశమంతా కేవలం ఉత్తరాది ఒకటేనని ఆయన భావిస్తున్నారని.. దక్షిణాది వారిని నల్లజాతీయులనడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.