Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నమ్మకు నో చాన్స్?.. సుప్రీంతీర్పు కోసం గవర్నర్ వేచి చూపులు?

తమిళ రాజకీయం సినిమా ఉత్కంఠను తలపిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఏ క్షణాన ఏ నిర్ణయం చెబుతారోనని ప్రతి ఒక్కరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నా.. ఎలాంటి ప్రకటన రావటం లేదు. శుక్రవారం ఆయనతో డ

చిన్నమ్మకు నో చాన్స్?.. సుప్రీంతీర్పు కోసం గవర్నర్ వేచి చూపులు?
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (10:59 IST)
తమిళ రాజకీయం సినిమా ఉత్కంఠను తలపిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఏ క్షణాన ఏ నిర్ణయం చెబుతారోనని ప్రతి ఒక్కరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నా.. ఎలాంటి ప్రకటన రావటం లేదు. శుక్రవారం ఆయనతో డీజీపీ భేటీ అనంతరం నిర్ణయం వెలువడుతుందని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. 
 
కానీ, ఆయన మాత్రం మిన్నకుండిపోయారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో శశికళ, పన్నీర్ సెల్వంలలో ఏ ఒక్కరికి అనుకూలంగా నిర్ణయం వెలువరించినా శాంతి భద్రతలు దెబ్బతిని పాలనా వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందన్న భావనతోనే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అదీకాకుండా, త్వరలోనే అక్రమాస్తుల కేసులో శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశాలున్నందున అప్పటి వరకు ఆగాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక వెళ్లిందన్న వార్తల్ని రాజ్‌భవన్ అధికారులు కొట్టేశారు. హోంశాఖకు ఎలాంటి నివేదిక పంపలేదని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతో రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లోర్ టెస్ట్ నిర్వహించండి.. ఎవరి బలమేంతో తేలిపోద్ది : గవర్నర్‌కు స్టాలిన్ విన్నపం