Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడుకు ఇదేమి కొత్తకాదు.. మంచి నిర్ణయమే తీసుకుంటారు : కె. రోశయ్య

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం వంటి సంఘటనలు కొత్తేమి కాదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రోశయ్య హైదరాబాద్‌లో స్ప

Advertiesment
Tamil Nadu political crisis
, గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:08 IST)
తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం వంటి సంఘటనలు కొత్తేమి కాదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రోశయ్య హైదరాబాద్‌లో స్పందిస్తూ... ‘ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా గవర్నరు నిర్ణయాలు తీసుకుంటారు. తమిళనాడుకి ఇదేమి కొత్తకాదు. ఈ సమస్యను విద్యాసాగర్‌రావు చక్కగా పరిష్కరిస్తారు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, మహారాష్ట్రకు గవర్నర్‌గా పనిచేస్తున్నారన్నారు. 
 
ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే, జరుగుతున్నది మంచా చెడా అనేది నేను చెప్పలేను. మరికొద్ది గంటలు వేచి ఉంటే నిర్ణయం తెలుస్తుంది. నిర్ణయం ప్రకటించాక పరిస్థితి అంతా సద్దుమణుగుతుందని రోశయ్య అభిప్రాయపడ్డారు. కాగా, తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో గురువారం రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సమావేశమై తమతమ వాదనలు వినిపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు రోజుల్లో శశికళ కథ సమాప్తం : సీఎం పన్నీర్ వర్గం నేత పాండ్యన్