తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ ప్రధాని వద్దకు అందుకే వెళ్లారా?
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనీ, తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఐతే సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రితో భేటీ అయినది వర్దా తుఫాన్ భార
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనీ, తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఐతే సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రితో భేటీ అయినది వర్దా తుఫాన్ భారీ నష్టం నేపద్యంలో పరిస్థితిని వివరించేందుకు వెళ్లారని అంటున్నారు.
రాష్ట్రానికి రూ. 22,573 కోట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మాజీముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న అవార్డు ఇవ్వాలనీ, ఆమె కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు హాలులో పెట్టాలని ప్రధానికి విన్నవించారు. ఐతే ఈ భేటీలో పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ఆయన చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.