Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోట్ల కష్టాలు తీరనున్నాయి.. కొత్త రూ. 500నోట్లు విరివిగా చలామణీలోకి రానున్నాయి

పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఇకపై బారులు తీరాల్సిన అవసరం లేదు. ఇకపై కొత్త రూ.500నోట్లు విరివిగా చలామణీలోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నాసిక్‌లోని నో

Advertiesment
Threefold increase in printing of 500-rupee notes
, శనివారం, 24 డిశెంబరు 2016 (12:21 IST)
పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఇకపై బారులు తీరాల్సిన అవసరం లేదు. ఇకపై కొత్త రూ.500నోట్లు విరివిగా చలామణీలోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నాసిక్‌లోని నోట్ల ముద్రణాలయంలో రూ.500నోట్ల ముద్రణను వేగవంతం చేశారు. అంతేగాకుండా పెద్దనోట్ల రద్దు అనంతరం శుక్రవారం పెద్దఎత్తున నోట్లను ఆర్బీఐకి పంపించినట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ అధికారులు తెలిపారు. 
 
మొత్తం 4.3 కోట్లను పంపించామని.. ఇందులో  1.1కోట్ల రూ.500 నోట్లు, 1.2కోట్ల రూ.వందనోట్లు, కోటి వరకు రూ.50, రూ.20నోట్లు ఉన్నాయని ప్రెస్ అధికారులు తెలిపారు. నోట్ల రద్దు అనంతరం 43రోజుల్లో ఇక్కడి నుంచి 82.8కోట్ల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్బీఐ శాఖలకు పంపించినట్లు ముద్రణా సంస్థ తెలిపింది. వీటిలో 25కోట్ల కొత్తరూ.500నోట్లు ఉన్నాయి. కాగా గత మూడు రోజుల్లో 8.3కోట్ల నోట్లను దేశవ్యాప్తంగా సరఫరా చేసినట్లు పేర్కొన్నాయి. అందులో 3.75కోట్లు కొత్త రూ.500నోట్లు కావడం గమనార్హం.
 
జనవరి 31 నాటికి అన్నీ కలిపి మరో 80కోట్ల నోట్లను ముద్రించనున్నట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఇందులో కేవలం సగం నోట్లు రూ.500 రూపంలోనే ముద్రించనున్నామని తెలిపాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాంబారు పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. నల్గొండలో దారుణం