మహిళా ఇంజనీర్‌కు అసభ్య మెసేజ్‌లు.. 49 మంది బీఎస్ఎన్ఎల్ అధికారులపై కేసు
తూత్తుకుడి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు సమాచార మార్పిడి కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. అయితే 2016 జూలై 30వ తేదీ ఆ గ్రూపులో ఉన్న విజయలక్ష్మి అనే మహిళ ఇంజనీర్ వ్య
తూత్తుకుడి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు సమాచార మార్పిడి కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. అయితే 2016 జూలై 30వ తేదీ ఆ గ్రూపులో ఉన్న విజయలక్ష్మి అనే మహిళ ఇంజనీర్ వ్యక్తిగత విషయాలపై పలు అసభ్య మెసేజ్‌లు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం శూన్యం. దీంతో ఆమె తూత్తుకుడి జేఎం కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.
దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పిటిషనర్ ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేయాలని పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెనపాక్కం పోలీసులు లింగభాస్కర్, మరియ ఆంతోని పిచ్చై, 13 మంది మహిళా అధికారులు సహా 49 మందిపై బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.