టీవీలోని దెయ్యం పిల్ల బయటికి వచ్చేసింది.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు..
అదో టీవీ స్టోర్. టీవీలో దెయ్యం కనిపిస్తుంది. ఉన్నట్టుండి టీవీలోని దెయ్యం కాస్త నేల మీదకొచ్చింది. అంతే షాపులో ఉన్నవారంతా ఖంగుతిన్నారు. టీవీ కొందామని వచ్చిన వారంతా భయంతో జడుసుకున్నారు. ఇదంతా న్యూయార్క్
అదో టీవీ స్టోర్. టీవీలో దెయ్యం కనిపిస్తుంది. ఉన్నట్టుండి టీవీలోని దెయ్యం కాస్త నేల మీదకొచ్చింది. అంతే షాపులో ఉన్నవారంతా ఖంగుతిన్నారు. టీవీ కొందామని వచ్చిన వారంతా భయంతో జడుసుకున్నారు. ఇదంతా న్యూయార్క్‌లోని టీవీ స్టోర్‌లో చోటుచేసుకుంది. ఆ షాపులో కొన్ని వందల సంఖ్యలో టీవీలున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వస్తున్నారు.
అయితే అప్పుడే సడెన్‌గా ఓ టీవీలో నుంచి దెయ్యం పిల్ల బయటికి వచ్చింది. దీంతో టీవీలను కొనాలని అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయం చెంది, ఉలిక్కి పడి పరుగు లంకించుకున్నారు. అయితే… నిజానికి చెప్పాలంటే అది రియల్ దెయ్యం పిల్ల కాదు. ఆ టీవీ స్టోర్ వారు ఏర్పాటు చేసిందే.
కస్టమర్లు రావడానికి ముందే ఓ టీవీ వెనుక చిన్నపాటి గది ఏర్పాటు చేసి అందులో ఓ బాలికను అచ్చం ది రింగ్ ఇంగ్లిష్ సినిమాలోని దెయ్యం పిల్లలాగా ఉంచారు. ఇంకేముంది.. కస్టమర్లు రాగానే ఆ పిల్ల కాస్తా టీవీని తప్పించి బయటకు వచ్చేసింది. అంతే కస్టమర్లు భయంతో పరుగులు తీశారు.