Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారిద్దరు ఏకు మేకు అవుతున్నారు.. లేపేద్దాం : మోడీ - యోగిలపై కాశ్మీర్ టెర్రరిస్ట్ గురి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు తీవ్రవాదుల నుంచే ముప్పు పొంచివున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా వారిద్దరిని హతమార్చేందుకు కాశ్మీర

వారిద్దరు ఏకు మేకు అవుతున్నారు.. లేపేద్దాం : మోడీ - యోగిలపై కాశ్మీర్ టెర్రరిస్ట్ గురి?
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (09:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు తీవ్రవాదుల నుంచే ముప్పు పొంచివున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా వారిద్దరిని హతమార్చేందుకు కాశ్మీర్ తీవ్రవాదులు కుట్రపన్నుతున్నట్టు సమాచారం. 
 
కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు... లండన్‌కు చెందిన కొందరు కాశ్మీరీ ఉగ్రవాదులు కొందరు ఇప్పటికే కాశ్మీర్‌లోకి చొరబడ్డారు. వీరు చిన్న బృందాలుగా విడిపోయి యూపీ.. ఢిల్లీలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి కోసం నిఘా వర్గాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కానీ, ఆచూకీ మాత్రం కనిపెట్టలేక పోయారు. దీంతో నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని ప్రధానికి రక్షణ కల్పించే ప్రత్యేక రక్షణ దళానికి (ఎస్పీజీ), యూపీ సీఎం యోగికి భద్రతను కల్పించే అధికారులకు చేరవేశారు. 
 
వాస్తవానికి మోడీ చాలా ఏళ్లుగా ఉగ్రవాదుల ప్రధాన టార్గెట్‌. ఈ హెచ్చరికల నేపథ్యంలో గతవారం కేంద్ర హోం శాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. యూపీ సీఎం యోగికి ఎన్ఎస్‌జీ కమాండో భద్రతను కల్పించాలని నిర్ణయించింది. ఆయనకున్న జడ్‌‌ప్లస్‌ భద్రతకు ఇది అదనమని తెలిపింది. ఇలాంటి భద్రత ప్రస్తుతం 16 మంది వీవీఐపీలకు మాత్రమే ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థిక మంత్రి పదవి ఇస్తాం సర్దుకోండి: పళని గ్రూపు వైఖరితో విసిగిపోయిన పన్నీర్.. విలీనం కష్టమే..