సోషల్ మీడియా ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. సోషల్ మీడియా ద్వారా తెలియని విషయాన్ని సులభంగా సెర్చ్ ద్వారా తెలుసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఓ టెక్కీ యూట్యూబ్‌లో ఎలా ఆత్మహత్య చేసుకోవాలో తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో బీదర్‌కు చెందిన జీవన్ అంబటె (33) బెంగళూరులోని మహదేవపురా.. లక్ష్మీనగర్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అతడు.. అమెజాన్ కంపెనీలో టీం లీడర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఇటీవల కాలంలో అతనికి జీవితంపై విరక్తి పుట్టింది. ఏమీ సాధించలేనని తరచూ బాధపడేవాడు. అనంతరం డిప్రెషన్‌కు లోనయి హౌ టు డై అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయసాగాడు.
యూట్యూబ్‌లో వెతికి చివరికి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్‌ను ఎన్నుకున్నాడు. ఆన్‌లైన్‌లో ప్రయోగాల కోసమని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ముఖాన్ని ప్లాస్టిక్ సంచితో కప్పుకున్నాడు. అందులోకి పైప్‌ను పెట్టుకుని వాయువును పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మూడురోజుల తర్వాత అతని స్నేహితులు గదికి వచ్చి చూడగా అతడు విగత జీవిగా మరణించి కనిపించాడు. ఈ విషయాన్ని మృతుడి స్నేహితులు మహదేవపుర పోలీసు స్టేషన్‌కు తెలియజేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఇంకా జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నానని, కానీ అవన్నీ నేరవేదని సూసైడ్ లేఖలో వాపోయాడు. తానో యంత్రంలా మారిపోయానని, ఈ జీవితం తనకు నచ్చలేదని ఆ నోట్‌లో జీవన్ తెలిపాడు.