Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామాయణ మహాభారతాలు ఊహాజనితాలు... : టీచర్‌పై వేటు

రామాయణ మహాభారతాలు ఊహాజనితాలు... : టీచర్‌పై వేటు

ఠాగూర్

, మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (13:32 IST)
రామాయణ మహాభారతాలు ఊహజనితాలంటూ పాఠాలు బోధించిన ఓ ఉపాధ్యాయుడిపై వేటుపడింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రామాయణ మహాభారతాలు ఊహాజనితాలంటూ 7వ తరగతి విద్యార్థులకు ఓ కర్ణాటక కాన్వెంట్ స్కూల్ టీచరు బోధించారు. దీనిపై మంగళూరులో నిరసనలు వ్యక్తం కావడంతో స్కూలు యాజమాన్యం ఆమెను విధుల నుంచి డిస్మిస్ చేసింది. మంగళూరులోని సెయింట్ జెరోసా ఇంగ్లీష్ హెర్ఆర్ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన వెలుగుచూసింది. 
 
రాముడు కల్పితమంటూ ప్రైమరీ స్కూలు విద్యార్థులకు టీచర్ బోధించిందంటూ ఓ వర్గం నిరసనకు దిగింది. పిల్లల ముందు గోద్రా అల్లర్లు, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసును ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిందని వారు ఆరోపించారు. టీచర్‌ను తొలగించాలంటూ శనివారం నిరసనకు దిగారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వేద్యాస్ కామత్ కూడా వారికి మద్దతు పలికారు.
 
'ఇలాంటి టీచరు మీరు మద్దతు ఇస్తారా? మీ నైతికత ఏమైంది? టీచర్‌ను ఇంకా ఎందుకు విధుల్లో కొనసాగనిస్తున్నారు? మీ సిస్టర్లు హిందూ పిల్లలకు బొట్టు పెట్టుకోవద్దని, పూలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. మీ నమ్మకాలను ఇలా అవమానపరిస్తే మీరు ఊరుకుంటారా?” అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ ఘటనపై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇనిస్టిట్యూషన్స్ దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్‌ను స్కూల్ యాజమాన్యం డిస్మిస్ చేసింది. 60 ఏళ్ల స్కూలు చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని స్కూల్ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపింది. పోయిన నమ్మకాన్ని తిరిగి పొందేందుకు తామందరం కలిసి పనిచేస్తామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాసనసభ సాక్షిగా ఆడబిడ్డను అవమానిస్తే స్పీకర్‌గా నువ్వు పీకిందేంటి తమ్మినేని : నారా లోకేశ్ ఫైర్