విద్యార్థుల పట్ల ఓ టీచర్ దారుణంగా ప్రవర్తించింది. పాఠశాలకు సరిగ్గా రావట్లేదని.. ఇంకా బాగా చదవట్లేదనే కారణంతో ఓ టీచర్ విద్యార్థుల పాదాలను కర్పూరం వెలిగించి కాల్చేసింది. ఈ ఘటన తమిళనాడులోని విళుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉలుందూరు పేట సమీపంలోని పల్లి పన్ జయత్ అనే ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు వైజయంతిమాల అనే టీచర్ పాఠాలు బోధించేది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	అయితే కొందరు విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా రాకపోవడంతో పాటు చదువుపై శ్రద్ధ చూపించకపోవడంతో కర్పూరాన్ని వెలిగించి.. ఆ నిప్పుతో 13 మంది చిన్నారులను గాయపరిచింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై విళుపురం విద్యాధికారి మార్స్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా వైజయంతిమాలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా పాఠశాల హెడ్‌మాస్టర్ వద్ద కూడా విచారణ చేపట్టాలని మార్స్ వెల్లడించారు.