Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడు రాజకీయాలు కేంద్రం చేతిలో... శశికళ తలాడించేనా?

ఇక తమిళనాడు రాజకీయాలు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయాయి. తాత్కాలిక గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ రావు నివేదిక తర్వాత మొత్తం రాజకీయాలు కేంద్రమంత్రుల చేతుల్లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

తమిళనాడు రాజకీయాలు కేంద్రం చేతిలో... శశికళ తలాడించేనా?
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (12:32 IST)
ఇక తమిళనాడు రాజకీయాలు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయాయి. తాత్కాలిక గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ రావు నివేదిక తర్వాత మొత్తం రాజకీయాలు కేంద్రమంత్రుల చేతుల్లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు వెంకయ్యనాయుడు తీసుకునే నిర్ణయాలపైనే మొత్తం తమిళరాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. అదెలాగంటారా.. మీరే చూడండి..
 
తమిళనాడు రాజకీయాలను మేం పట్టించుకోం. మాకేం సంబంధం లేదు. గవర్నర్ అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. ఇది కేంద్ర ప్రసార శాఖామంత్రి వెంకయ్య నాయుడు చెప్పిన కథ. అయితే అంతా కేంద్రం కనుసన్నల్లో నడుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. బీజేపీలోని పెద్దలకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యంత సన్నిహితుడు. వారు ఎలా చెబితే అలా నడుస్తారు మరి. అలాంటి వ్యక్తి చివరకు ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం.. చివరక పార్టీ సభ్యత్వం కూడా లేకుండా ఖాళీగా ఉండటం. ఇదంతా ఒక వ్యవహారమైతే పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి చేయడానికి గత కొన్ని రోజుల పాటు ఏకంగా కేంద్రం సూచనలతో గవర్నర్ సైలెంట్ ఉంటూ వచ్చారు.
 
ఎన్నిసార్లు శశికళతో పాటు పళనిస్వామి వినతులు పెట్టినా పట్టించకుకోదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కారణం ఆలస్యం చేసేకొద్దీ పన్నీర్ సెల్వం, పళనిస్వామి శిబిరంలోని ఎమ్మెల్యేలను లాగేసుకుంటారేమోనన్న ఒక నమ్మకంతో. అది కాస్త జరుగలేదు. అయితే చివరి అవకాశంగా శాసనసభలో బలనిరూపణ జరిగింది. అందులోనూ ఓడిపోయారు పన్నీర్ సెల్వం. ఇక చివరకు శాసనసభలో గందరగోళం జరిగి ఆ తర్వాత పంచాయతీ కేంద్రంకే వెళ్ళింది.
 
ఇక చివరి నిర్ణయం కేంద్రం నుంచే. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నారు. ఆయన ప్రధానమంత్రికి ఏం చెబితే అదే జరుగుతుంది. ఒకవేళ కేంద్ర హోంమంత్రి రాష్ట్రపతి పాలన పెట్టేస్తామని ప్రధానికి చెబితే.. ఇక రాష్ట్రపతి పాలన రాక తప్పదు. అన్నీ అయిపోయిందిలే వదిలేద్దామనుకుంటే పళనిస్వామి బతికి బట్టకట్టినట్లే. అయితే రెండుమూడు రోజుల్లో కేంద్రం నిర్ణయం బయటకు రాక తప్పదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్లార్పకుండా చంద్రబాబు అబద్దాన్ని చెప్పగలడా...!