Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళ భర్తను నెత్తురొచ్చేట్టు కుమ్మేశారు... అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం బయటే... ఏం జరుగుతుంది?

తమిళనాడు రాజకీయాలు రోజుకో రకంగా వార్తల్లోకి వస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళకు అప్పగించడానికి వీల్లేదంటూ శశికళ పుష్ప వర్గం ధ్వమెత్తుతోంది. ఆమె తన భర్తతో సహా మరికొంతమంది మద్దతుదారులతో కలి

Advertiesment
శశికళ భర్తను నెత్తురొచ్చేట్టు కుమ్మేశారు... అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం బయటే... ఏం జరుగుతుంది?
, బుధవారం, 28 డిశెంబరు 2016 (17:34 IST)
తమిళనాడు రాజకీయాలు రోజుకో రకంగా వార్తల్లోకి వస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళకు అప్పగించడానికి వీల్లేదంటూ శశికళ పుష్ప వర్గం ధ్వమెత్తుతోంది. ఆమె తన భర్తతో సహా మరికొంతమంది మద్దతుదారులతో కలిసి అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఐతే అక్కడ జయలలిత నెచ్చెలి శశికళ మద్దతుదారులు శశికళ పుష్ప, ఆమె భర్తపై దాడికి దిగారు. శశికళ పుష్ప భర్తను రక్తం కారేట్టు చితక బాదారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేపు పార్టీ సర్వసభ్య సమావేశం జరుగనుండగా బుధవారం నాడు చోటుచేసుకున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
జయలలిత వారసురాలిగా శశికళను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దెనెక్కనిచ్చేది లేదని శశికళ పుష్ప వర్గం అంటోంది. అసలు శశికళను జయలలిత 2011లో పార్టీ నుంచి బహిష్కరించారనీ, అలాంటప్పుడు ఆమె పార్టీ అధ్యక్ష పదవికి ఎలా పోటీ చేస్తారంటూ వారు వాదిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆమె ఐదేళ్లపాటు... అంటే 2017 వరకూ పార్టీకి చెందిన ఏ పదవికి అర్హురాలు కాదంటూ వాదిస్తున్నారు. మరి రేపటి సమావేశంలో పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగిస్తారన్నది సస్పెన్సుగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్మోహన్ రావూ... జాగ్రత్త, ఇలా మాట్లాడితే ఇంకా... వెంకయ్య హెచ్చరిక