Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు అసెంబ్లీ సంఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానం : వెంకయ్య

తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానకరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం అసెంబ్లీలో జరిగిన ఈ ఘటనపై సభ్యులందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని, భవిష్యత్‌లో

తమిళనాడు అసెంబ్లీ సంఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానం : వెంకయ్య
, ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (17:11 IST)
తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానకరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం అసెంబ్లీలో జరిగిన ఈ ఘటనపై సభ్యులందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆయన హితవు పలికారు.
 
కాగా, తమిళనాడు కొత్త సీఎం పళనిస్వామి సర్కారు అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతో పాటు.. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వంలు రహస్య ఓటింగ్‌కు డిమాండ్ చేయగా స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో విధ్వంసం సృష్టించారు. మైక్‌లను, కుర్చీలను విరగ్గొట్టడమే కాకుండా, స్పీకర్ ధన్‌పాల్ పట్ల అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పళని స్వామి సర్కారు కూలిపోవడం ఖాయం.. ఎన్నికలు తథ్యం : స్టాలిన్ జోస్యం