Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీఎంకేకు షాక్... వారంతా అన్నాడీఎంకేలోనే ఉన్నారంటున్న గవర్నర్

తమిళనాడులోని ప్రధాన విపక్ష పార్టీ డీఎంకేకు ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తేరుకోలేని షాకిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రభుత్వానికి అసెంబ్లీలో తగినంత సంఖ్

Advertiesment
డీఎంకేకు షాక్... వారంతా అన్నాడీఎంకేలోనే ఉన్నారంటున్న గవర్నర్
, గురువారం, 31 ఆగస్టు 2017 (09:07 IST)
తమిళనాడులోని ప్రధాన విపక్ష పార్టీ డీఎంకేకు ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తేరుకోలేని షాకిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రభుత్వానికి అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేదనీ, అందువల్ల విశ్వాస పరీక్ష చేపట్టాలని కోరుతూ డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిశారు.
 
ఈ సందర్భంగా వారి డిమాండ్‌‌ను గవర్నర్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అనిశ్చితికి కారణమైన 19 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనే ఉన్నారని స్టాలిన్‌కు స్పష్టంచేశారు. అలాంటి పరిస్థితుల్లో తాను పళనిస్వామిని రాజీనామా చేయమని కోరలేనని ఆయన తెలిపారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది.
 
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వం తన పార్టీని అన్నాడీఎంకేలో కలిపేసి, డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రిసార్ట్‌కు పరిమితమైన దినకరన్ వర్గానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం రిసార్ట్‌ను వీడనున్నారు. శశికళ, టీటీవీ దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన తన మద్దతుదారు ఎమ్యెల్యేలతో రిసార్ట్‌కు చేరారు.
 
అప్పటి నుంచి పళనిస్వామి ప్రభుత్వాన్ని పడదోస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరితో కలిసి గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిసి మెమొరాండం ఇచ్చారు. అయితే పార్టీ అంతర్గత వ్యవహారంలో తాము తలదూర్చమని గవర్నర్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసేందుకు వారంతా ఢిల్లీ వెళ్లేందుకు వారంతా రిస్టార్ వీడనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థ్యాంక్యూ ఇండియా : ఫ్రెంచ్ ఫ్యామిలీ కృతజ్ఞతలు... ఎందుకు?