Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగారం చేయబోయాడని భర్త మర్మావయాన్ని కట్ చేసి పర్సులో పెట్టేసింది...

తమిళనాడులోని వేలూరులో ఓ భయంకరమైన ఘటన జరిగింది. తన భర్త తనకు ఇష్టం లేకుండా శృంగారం చేసేందుకు ప్రయత్నించాడని అతడి మర్మావయవాన్ని పదునైన కత్తితో కోసి ఆ భాగాన్ని తన బ్యాగులో పెట్టేసుకుని పరారైంది. ఈ ఘటన వివరాలను చూస్తే... 30 ఏళ్ల సరసు అనే మహిళ తన భర్తతో గ

Advertiesment
Tamil Nadu crime
, సోమవారం, 24 జులై 2017 (20:14 IST)
తమిళనాడులోని వేలూరులో ఓ భయంకరమైన ఘటన జరిగింది. తన భర్త తనకు ఇష్టం లేకుండా శృంగారం చేసేందుకు ప్రయత్నించాడని అతడి మర్మావయవాన్ని పదునైన కత్తితో కోసి ఆ భాగాన్ని తన బ్యాగులో పెట్టేసుకుని పరారైంది. ఈ ఘటన వివరాలను చూస్తే... 30 ఏళ్ల సరసు అనే మహిళ తన భర్తతో గొడవలొచ్చి తన పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే వుంటోంది. కానీ పిల్లలు మాత్రం భర్త వద్దే వుంటున్నారు. 
 
ఈ నేపధ్యంలో తన కుమార్తె పుట్టినరోజు రావడంతో ఆమె తన అమ్మమ్మ ఇంటి వద్ద వున్న తల్లిని ఇంటికి రావాల్సిందిగా పదేపదే కోరింది. దాంతో కుమార్తె పుట్టినరోజు వేడుక కోసం పుట్టింటి నుంచి భర్త ఇంటికి వచ్చిందామె. బుధవారం రాత్రి ఇద్దరూ చాలాసేపు గొడవపడినట్లు తెలుస్తోంది. 
 
ఈ గొడవ సద్దుమణిగాక భర్త నిద్రకు ఉపక్రమించిన సమయంలో వంటగదిలోని పదునైన కత్తి తీసుకుని అతడి మర్మావయవాన్ని కట్ చేసేసింది సరసు. ఆపై  ఆ భాగాన్ని తన బ్యాగులో వేసుకుని పరారయ్యింది. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న బాధితుడిని ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనపై బలవంతంగా శృంగార చేసేందుకు ప్రయత్నించినందుకే ఆ పని చేసినట్లు ఆమె వెల్లడించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి... సీఎం చంద్రబాబు