Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాచెల్లి పేరుతో ఆ దంపతులు ఎంత నీచానికి తెగించారంటే...!

జల్సాలకు అలవాటు పడిన ఆ దంపతులు... అన్నాచెల్లి పేరుతో చేయకూడని పనులు చేశారు. అనేక మంది యువతులను మోసగించి 100 సవర్ల మేరకు బంగారం దోచుకోవడమే కాకుండా, 20 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి

అన్నాచెల్లి పేరుతో ఆ దంపతులు ఎంత నీచానికి తెగించారంటే...!
, గురువారం, 28 జులై 2016 (08:36 IST)
జల్సాలకు అలవాటు పడిన ఆ దంపతులు... అన్నాచెల్లి పేరుతో చేయకూడని పనులు చేశారు. అనేక మంది యువతులను మోసగించి 100 సవర్ల మేరకు బంగారం దోచుకోవడమే కాకుండా, 20 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా తిరువేంబుయూర్‌కి చెందిన ఓ కళాశాల విద్యార్థిని రెండేళ్ల క్రితం అదృశ్యమైంది. దీని గురించి విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని కోసం పలు చోట్ల గాలించారు. ఇంతలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి నావలంపట్టు పోలీసు స్టేషన్‌లో హాజరై ఓ యువకుడు తనను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ధరించిన 8 సవర్ల నగలు కూడా అపహరించి పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఆ యువకుడికి అతడి సోదరి కూడా సహకరించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొంటూ.. ఆ ఇద్దరి ఫోటోలను కూడా ఇచ్చింది. ఈ ఫోటోల ఆధారంగా వారి కోసం తీవ్రంగా గాలింపుచర్యలు చేపట్టగా, వారిద్దరు తిరుచ్చి బస్టాండ్‌లో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద జరిపిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తిరుప్పూర్‌ జిల్లాకు చెందిన గురు దీన దయాళన్ అనే పట్టభద్రుడైన ఆ యువకుడు నిరుద్యోగి. ఫేస్‌బుక్‌లో యువతులతో పరిచయం పెంచుకుని, వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే 2013వ సంవత్సరం ప్రియదర్శినిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడని, ఆడంబరమైన జీవితాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో దంపతులు ఓ కొత్త పథకానికి తెరతీసినట్లు తెలిసింది. 
 
గురు దీనదయాళన్ ఫేస్‌బుక్‌ ద్వారా మహిళలను తన వలలో పడేసి పారిపోయి వివాహం చేసుకోవడానికి నగలతో రావాలని నమ్మించి రప్పించుకునేవాడు. అతడి మాటలు నమ్మిన యువతులు అలాగే వచ్చి మోసపోయేవారని, వచ్చిన యువతులకు గురు దీనదయాళన్, ప్రియదర్శినిలు అన్న, చెల్లిగా పరిచయం చేసుకునేవారని తెలిసింది. ఇప్పటివరకు నిందితుడు 20 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడి 100 సవర్లకు పైగా నగలు దోచుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంసెట్- 2 పేపర్ లీకేజీకి రూ.15 కోట్ల ఒప్పందం...