Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నగ్న ఆందోళన : మొండిమొలతో ప్రధాని వద్దకు తమిళ రైతులు.. అడ్డుకున్న పోలీసులు

రైతులను ఆదుకోవాలని కోరుతూ గత 28 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతుల్లో సహనం నశించింది పోయింది. ఫలితంగా ఇంతకాలం అర్థనగ్న ప్రదర్శనలకు పరిమితమైన వారు.. సోమవారం ఏకంగా శరీర

నగ్న ఆందోళన : మొండిమొలతో ప్రధాని వద్దకు తమిళ రైతులు.. అడ్డుకున్న పోలీసులు
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (15:13 IST)
రైతులను ఆదుకోవాలని కోరుతూ గత 28 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతుల్లో సహనం నశించింది పోయింది. ఫలితంగా ఇంతకాలం అర్థనగ్న ప్రదర్శనలకు పరిమితమైన వారు.. సోమవారం ఏకంగా శరీరంపై నూలుపోగు కూడా లేకుండా మొండిమొలతో ఆదోళనకు దిగారు. వారంతా కలిసి పీఎంవో కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా కరవు ఏర్పడింది. దీంతో జాతీయ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ వారు గత నెల 14వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినూత్న ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. పుర్రెలు, ఎలుకలు, పాములు, శవయాత్రలు ఇలా వివిధ రకాలుగా వారు ఆందోళన చేస్తూ వస్తున్నారు. వీరి ఆందోళనపై జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. కానీ, ఇటు కేంద్రం లేదా అటు ఒక్క కేంద్ర అధికారి కాని స్పందించలేదు. 
 
ఈనేపథ్యంలో రైతులు సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. పీఎంవో సహా కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సౌత్‌బ్లాక్‌ ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు, జాతీయ బ్యాంకులలో రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో వారు ఆందోళన చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాంబు పేల్చిన రిలయన్స్ జియో : అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్స్... ఎయిర్‌టెల్ హడల్!