Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రహస్యకు సీక్వెల్‌గా షీనా బోరా హత్య కేసు: ఇంద్రాణి పాత్రలో టబు.. నిజమేనా?

కన్నకూతురుని హతమార్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన షీనా బోరా హత్య కేసు సినిమాగా రూపుదిద్దుకోనుంది. 24ఏళ్ల షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రా ముఖర్జీ పాత్రలో సీనియర్ నటి టబు నటించ

Advertiesment
Tabu to play Indrani Mukerjea in film adaptation of Sheena Bora murder case?
, శుక్రవారం, 2 డిశెంబరు 2016 (15:10 IST)
కన్నకూతురుని హతమార్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన షీనా బోరా హత్య కేసు సినిమాగా రూపుదిద్దుకోనుంది. 24ఏళ్ల షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రా ముఖర్జీ పాత్రలో సీనియర్ నటి టబు నటించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది, 2015లో వచ్చిన రహస్య సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపుదిద్దుకోనుందని.. ఈ చిత్రానికి మనీష్ గుప్తా దర్శకత్వం వహిస్తారు. 
 
కాగా.. నోయిడాకి చెందిన టీనేజర్‌ ఆరుషి తల్వార్‌, వారి ఇంట్లో పనిమనిషి హేమ్‌రాజ్‌ బంజాడే 2008లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆధారంగా మనీశ్‌ గుప్తా 'రహస్య' అనే సినిమా తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా షీనా బోరా హత్య కేసును తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ మారియా పాత్రలో నవాజుద్దీన్‌ సిద్దిఖి నటించనున్నట్లు తెలుస్తోంది.
 
అయితే మనీశ్‌ ఈ స్క్రిప్ట్‌ను టబుకు వినిపిస్తే ఆమె ఇంద్రాణి పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదట. ఇక రాహుల్‌ ముఖర్జీ పాత్రలో విక్కీ కౌశల్‌ను సంప్రదిస్తే అతనూ తిరస్కరించినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాకింగ్ పెళ్లికూతురు... శోభనం రోజున కొత్త పెళ్లి కొడుక్కి మత్తెక్కించి మంచంపై పడేసి...