Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వాతికి టెర్రరిస్ట్ గ్రూపుతో సంబంధమా.. నిర్మాత కుమారుడికి లింకా.. టీవీ ఛానల్స్ ఓవరాక్షన్!

చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన టెక్కీ స్వాతి కేసులో రోజుకో వార్త పుట్టుకొస్తుంది. స్వాతికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు ఓ తమిళ టీవీ ఛానల్ కోడైకూస్తోంది. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చ

స్వాతికి టెర్రరిస్ట్ గ్రూపుతో సంబంధమా.. నిర్మాత కుమారుడికి లింకా.. టీవీ ఛానల్స్ ఓవరాక్షన్!
, శుక్రవారం, 29 జులై 2016 (15:55 IST)
చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన టెక్కీ స్వాతి కేసులో రోజుకో వార్త పుట్టుకొస్తుంది. స్వాతికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు ఓ తమిళ టీవీ ఛానల్ కోడైకూస్తోంది. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో స్వాతిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు వక్తలు తెలిపారు. బెంగళూరులో స్వాతి పనిచేస్తున్న సమయంలో ఓ సాఫ్ట్‌వేర్‌ను దొంగలించుకుని రావాల్సిందిగా తీవ్రవాద గ్రూపు బెదిరించినట్లు కూడా వక్తలు చెప్పారు. 
 
స్వాతికి ఐటీలో మంచి నిపుణత ఉండటంతో ఆమెను పావుగా టెర్రరిస్టు సంస్థ ఉపయోగించుకుందని న్యాయవాది కృష్ణమూర్తి చెప్తున్నారు. వేరే దారి లేక స్వాతి కూడా వారికి సహకరించినట్లు తెలుస్తోందన్నారు. సాఫ్ట్ వేర్‌ను దొంగలించిన తర్వాతే బెంగళూరు నుంచి ఆమె చెన్నైకి రావాల్సి వచ్చిందని, అందుకే ఆమె ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ వివరాలను బయటపెట్టేందుకు పోలీసులు అంగీకరించట్లేదని, ఇంకా ఐఎస్‌తో సంబంధాలున్న వ్యక్తుల్ని స్వాతి ల్యాప్ టా్ప్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి.
 
మరోవైపు స్వాతికి ప్రముఖ బుల్లితెర నిర్మాత కుమారుడితో సన్నిహితంగా ఉన్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. స్వాతి హత్య కేసులో సదరు నిర్మాత కుమారుడిని కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. ఇతడు కూడా ముస్లిం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇటీవల స్వాతి బాయ్‌ఫ్రెండ్ బిలాల్ మాలిక్ ముస్లిం కావడం, ప్రస్తుతం నిర్మాత కుమారుడు కూడా ముస్లిం కావడంతో హత్య కేసులో మరెన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయోనని ప్రజలు అనుకుంటున్నారు. అయితే స్వాతి హత్య కేసుకు సంబంధించి తమిళ టీవీ ఛానల్స్ ఓవరాక్షన్ చేస్తున్నాయని.. కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో హత్యకు గురైన స్వాతి పట్ల ఏవేవో రాసేస్తున్నాయని కుటుంబీకులు ఫైర్ అవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. అప్పుడలా... ఇప్పుడిలా చెప్పకూడదు: తెలంగాణ ఎంపీలు