ఆభరణాల దుకాణంలో పని చేస్తూ పేలుళ్ళకు ప్లాన్ : ఐఎస్ తీవ్రవాది వెల్లడి
తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లా కేంద్రంలోని ఓ ఆభరణాల దుకాణంలో పని చేస్తూ పేలుళ్ళకు ప్లాన్ చేస్తున్నట్టు తమిళనాడులో పట్టుబడిన ఐఎస్ సానుభూతిపరుడు సుబానీ హాజా మొయిద్దీన్ వెల్లడించాడు. తనకు ఇరాక్ మ
తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లా కేంద్రంలోని ఓ ఆభరణాల దుకాణంలో పని చేస్తూ పేలుళ్ళకు ప్లాన్ చేస్తున్నట్టు తమిళనాడులో పట్టుబడిన ఐఎస్ సానుభూతిపరుడు సుబానీ హాజా మొయిద్దీన్ వెల్లడించాడు. తనకు ఇరాక్ మోసుల్‌లో శిక్షణ ఇచ్చారని, ఆపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కలసి తాను పోరాడినట్టు చెప్పారు. ఈ శిక్షణ సమయంలో తనకు 6600 వేతనంతో పాటు ఆహారం, బస వంటి సదుపాయాలను కల్పించిందని చెప్పారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిగా పనిచేసి, ఇండియాలో ఉగ్రదాడులు జరపాలని వచ్చి అరెస్టయిన సుబానీ హాజా మొయిద్దీన్ ను విచారించిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలను అతని నోటి నుంచి రప్పించారు. ఇరాక్ వెళ్లిన తనకు మోసుల్ లో శిక్షణ ఇచ్చారని, ఆపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కలసి తాను పోరాడానని చెప్పాడు.
తాను భారత్‌కు వచ్చిన తర్వాత గడచిన రెండేళ్లలో 60 మందిని ఐఎస్ఐఎస్‌లో చేర్చినట్టు తెలిపాడు. 2015 ఏప్రిల్ 8న యాత్రకని ఇంట్లో తల్లిదండ్రులకు, భార్యకు చెప్పిన తాను, ఇస్తాంబుల్ మీదుగా ఇరాక్ వెళ్లానని, విజిటింగ్ వీసాపై చెన్నై నుంచే తన ప్రయాణం మొదలైందన్నాడు.
ఇస్తాంబుల్ వెళ్లిన తర్వాత, కొంతమంది పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్‌కు చెందిన ఫైటర్లతో కలసి సరిహద్దులు దాటి ఇరాక్‌లోకి ప్రవేశించినట్టు చెప్పాడు. మరో 30 మందితో కలిపి తనకు శిక్షణ ఇచ్చారని, వారిలో ఆస్ట్రేలియా, లెబనాన్ తదితర దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారని వివరించాడు.
శిక్షణ తర్వాత తొలుత కాపలా కాసే బాధ్యతలను, ఆపై వార్ జోన్‌కు పంపారని, కుర్దిష్, ఇరాకీ సైన్యంతో తలపడ్డానని, అందుకు నెలకు 100 యూఎస్ డాలర్లు (సుమారు రూ.6,600) ఇచ్చారని చెప్పాడు. సెప్టెంబర్‌లో తిరిగి ఇస్తాంబుల్‌కు వెళ్లి, రెండు వారాల పాటు ఉండి, ఆపై ఇండియన్ కాన్సులేట్ అధికారులను కలిసి, ముంబై మీదుగా ఇండియాకు వచ్చినట్టు చెప్పాడు.
ఆపై తిరునల్వేలిలో ఓ ఆభరణాల దుకాణంలో పనికి కుదిరి పేలుళ్లకు ప్లాన్ వేస్తున్నామని చెప్పాడు. శివకాశి నుంచి రసాయనాలు తెచ్చి, బాంబులు తయారు చేసి వివిధ ప్రాంతాల్లో ఒకే చోట పేల్చాలన్నది తమ లక్ష్యమని వివరించాడు. ఆపై కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, ఆర్ఎస్ఎస్ నేతలను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్టు చెప్పాడు.