'నాన్న నన్ను బాగా చదువుకోవాలని చెప్పారు'... ఈ మాట నా హృదయాన్ని ద్రవింపజేసింది...
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు చేసిన దాడిలో 18 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ అమర వీరుల్లో ఓ జవాను కుమారుడు... తండ్రిపోయిన బాధతో కన్నీరుమ
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు చేసిన దాడిలో 18 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ అమర వీరుల్లో ఓ జవాను కుమారుడు... తండ్రిపోయిన బాధతో కన్నీరుమున్నీరవుతూ 'నాన్న నన్ను బాగా చదువుకోవాలని చెప్పారు' అనడం తన హృదయాన్ని ద్రవింపజేసిందని గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మహేష్ సవానీ తెలిపారు.
దీంతో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. వారికి తాను నడుపుతున్న పీపీ సవానీ పాఠశాలలోనే ఉచిత విద్యనందించేందుకు సిద్ధంగా ఉన్నానని మహేష్ సవానీ ప్రకటించారు.
మంచి విద్యతోపాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సేవలో భాగంగా మహేష్ సవానీ ఇప్పటికే తల్లిదండ్రుల్లేని 472 మంది ఆడపిల్లలకు దగ్గరుండి మరీ వివాహాలు జరిపించి, వారికి దేవుడిచ్చిన తండ్రిగా మారిపోయారు.