Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాలుగేళ్ళ చిన్నారి అత్యాచారం కేసులో ఐదు రోజుల్లో కోర్టు తీర్పు

నాలుగేళ్ళ చిన్నారి అత్యాచారం కేసులో ఐదు రోజుల్లో కోర్టు తీర్పు
, శుక్రవారం, 12 నవంబరు 2021 (11:55 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో నాలుగేళ్ళ చిన్నారి అత్యాచారం కేసులో ఫోక్సో కోర్టు కేవలం ఐదు రోజుల్లోనే తీర్పును వెలువరించింది. తద్వారా అత్యాచారం కేసులో ముద్దాయిగా తేలిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.లక్ష అపరాధం కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఇటీవల గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ నగరంలో నాలుగేళ్ళ పాప హత్యాచారానికి గురైంది. గత నెల 12న హనుమాన్‌ అలియాస్‌ అజయ్‌ మంగి నిషదె (39) అనే వ్యక్తి.. పళ్లరసం ఇస్తానంటూ ఓ పాపను పిలిచాడు. సమీపంలోని పారిశ్రామిక పార్కులోకి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆపై గొంతు నులిమి చంపేశాడు.
 
దీనిపై కేసు స్థానిక పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన సూరత్ ఫోకోస్ కోర్టు కేవలం ఐదు రోజుల్లో విచారణ పూర్తిచేసి శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో పోక్సో కోర్టు రాత్రి 11 గంటల వరకూ వాదనలు ఆలకించింది. అజయ్‌కి అదనపు సెషన్స్‌ జడ్జి ప్రకాశ్‌ చంద్ర కాలా తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేశారు. రూ.లక్ష జరిమానా కూడా విధించారు. 
 
కోర్టు సెలవులు తీసేస్తే సాంకేతికంగా 5 రోజుల్లోనే తీర్పు వచ్చినట్లవుతుందని జిల్లా చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నయన్‌ సుఖద్‌వాలా తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందినప్పటి నుంచి చూస్తే 30 రోజుల్లోనే శిక్ష ఖరారైందని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో కరెంట్ చార్జీల బాదుడు???