Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్న శశికళ.. జయమ్మ పేరును తొలగిస్తారా?

తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధపడుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళను అక్రమాస్తుల కేసుతో కష్టాలు తప్పట్లేదు. ఈ కేసు నుంచి త్వరగా బయటపడితే.. సీఎం పదవి చేపట్టేందుకు తనకు లైన్‌ క్లియర్‌

సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్న శశికళ..  జయమ్మ పేరును తొలగిస్తారా?
, ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (12:06 IST)
తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధపడుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళను అక్రమాస్తుల కేసుతో కష్టాలు తప్పట్లేదు. ఈ కేసు నుంచి త్వరగా బయటపడితే.. సీఎం పదవి చేపట్టేందుకు తనకు లైన్‌ క్లియర్‌ అవుతుందని శశికళ భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో ఆ అవకాశాలు లేవని తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు నుంచి జయలలిత పేరును తొలగించాలని తాజాగా కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
న్యాయపరమైన అంశం కావడంతో కర్ణాటక పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించే అవకాశముంది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆలస్యమయ్యే అవకాశముంది. దీంతో సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం లేదని తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళను, ఆమె కుటుంబసభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును జయలలిత సవాల్‌ చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును కొట్టేసింది.
 
హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలో జయలలిత మరణించడం.. ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా.. ఎన్నికకావడమే కాకుండా సీఎం పదవి కోసం సిద్ధమవుతుండటంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోయెస్ గార్డెన్ గురించి మీకు తెలుసా? ఎంతకు కొన్నారంటే..? రూ.1.37లక్షలకు?