Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాలి జనార్థన్ రెడ్డి కూతురు పెళ్లికి అంతే ఖర్చు పెట్టాడట.. సుప్రీంలో ఊరట.. హ్యాపీగా సంక్రాంతి సంబరాలు..

మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా జరుపుకోనున్నారు. సంక్రాంతికి బళ్లారీలో అడుగు పెట్టి సందడి చెయ్యనున్నారు. తనకుమార్తె బ్రహ్మిణి, అల్లుడు రాజీవ్ రెడ్

Advertiesment
supreme court allowed former minister gali janardhana reddy
, శుక్రవారం, 13 జనవరి 2017 (11:44 IST)
మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా జరుపుకోనున్నారు. సంక్రాంతికి బళ్లారీలో అడుగు పెట్టి సందడి చెయ్యనున్నారు. తనకుమార్తె బ్రహ్మిణి, అల్లుడు రాజీవ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి బళ్లారికి బయలుదేరారు.
 
ఇప్పటికే కూతురి పెళ్లి విషయంలో దేశంలో అందరినీ దృష్టిని ఆకర్షించిన గాలి జనార్ధన్ రెడ్డి.. ఐటీ బదులిచ్చారు. తన కుమార్తె పెళ్లికి రూ.30 కోట్లే ఖర్చు చేశానని చెప్పారట. దీనికి సంబంధించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు లెక్కలు చూపించారు. కుమార్తె బ్రహ్మణి పెళ్లికి గాలి దాదాపు రూ.400 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఐటీ అధికారులకు ఆయన సమర్పించిన లెక్కలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
నోట్ల రద్దు సమయంలో కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కనీసం రూ. 2 వేలైనా దొరక్క ప్రజలు అల్లాడిపోతున్న వేళ, గాలి అంత గొప్పగా పెళ్లి ఎలా జరిపించాడంటూ విపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. పెళ్లి కోసం పెద్ద మొత్తంలో నల్లధనాన్ని అక్రమ మార్గాల్లో కొత్త నోట్ల రూపంలోకి మార్చుకున్నారని గాలిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో గాలికి కర్ణాటక రెవెన్యూ అధికారి భీమా నాయక్ కీలకపాత్ర పోషించినట్టు తేలింది. 
 
దీంతో పెళ్లి ఖర్చుల వివరాలు తెలపాలంటూ ఐటీ శాఖ జనార్దన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి వివరాలను సమర్పించారు. పెళ్లికి కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చయినట్టు పేర్కొన్నారు. తన భార్య అరణాలక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న ట్యూబుల్ రివేట్స్ నుంచి నిధులు సమకూరినట్టు పేర్కొన్నారు. పెళ్లికి సంబంధించిన కొనుగోళ్లన్నీ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానే జరిగినట్టు వివరించారు.
 
ఇదిలా ఉంటే, సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తాను బళ్లారీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. అర్జీ పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు బళ్లారీలో ఉండటానికి గాలి జనార్దన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ ఎగ్జామ్ బోర్డు నిర్లక్ష్యం.. హాల్ టిక్కెట్‌పై ఫోటోకు బదులు నగ్న ఫోటో