సోలార్ సైకిల్‌లో మార్పుల కారణంగా సూర్యుడి వేడి అంతకంతకూ పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగా భూమిపై జీవరాశికి మూలమైన సూర్యుడి ఉపరితలంపై కరోనల్ మాస్ ఎజెక్షన్ అనే విస్ఫోటనం ఏర్పడిందని, అది భూమి వైపు ప్రయాణిస్తోందని వివరించారు.
వాస్తవానికి బలమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) భూమిని దాటినప్పుడు.. అది మన ఉపగ్రహాలలోని ఎలక్ట్రానిక్ వస్తువులను దారుణంగా దెబ్బతీస్తుంది. భూమిపై రేడియో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. భూమిపై రేడియో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది.
మార్చి 28న సూర్యునిపై 12975, 12976 రీజియన్‌ల నుంచి సౌర మంటలు విడుదలయ్యాయి. ఈ మంటలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకితే కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రేరిత మోస్తరు భూ అయస్కాంత తుపానులు వచ్చే అవకాశం ఉందని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ తెలిపింది.
ఇంకా కరోనల్ మాస్ ఎజెక్షన్ గురువారం భూమిని తాకుతుందని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ విభాగం పేర్కొంది.
కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది సూర్యుని ఉపరితలంపై సంభవించే అతిపెద్ద విస్ఫోటనాలలో ఒకటి. ఇది ఒక బిలియన్ టన్నుల పదార్థాన్ని కలిగి ఉంటుంది. అంతరిక్షంలో గంటకు అనేక మిలియన్ మైళ్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.
ఈ సౌర పదార్థం ఇంటర్‌ప్లానెటరీ మాధ్యమం ద్వారా ప్రవహిస్తుంది. దాని మార్గంలో ఏదైనా గ్రహం లేదా శాటిలైట్లు అడ్డువచ్చినా ప్రభావితం చేస్తుంది. ఈ విస్ఫోటనం మార్చి 31న 496 నుంచి 607 కి.మీ/సె వేగంతో భూమిపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.