Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఇదో కోల్డ్ బ్లడెడ్ మర్డర్'... దెబ్బకు దెబ్బ కొడతాం : రాజ్‌నాథ్ శపథం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చిన ఆయన

Advertiesment
'ఇదో కోల్డ్ బ్లడెడ్ మర్డర్'... దెబ్బకు దెబ్బ కొడతాం : రాజ్‌నాథ్ శపథం
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (12:51 IST)
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చిన ఆయన, మృతదేహాలకు నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాన్ల త్యాగాన్ని వృథాకానీవ్వబోమన్నారు. ఇది ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌. ప్రతీకారం తీర్చుకుని తీరుతామన్నారు. ఈ రీజియన్‌లో అభివృద్ధిని అడ్డుకోవడమే నక్సల్స్ వ్యూహమని, ఇకపై తాము వామపక్ష తీవ్రవాదంపై వ్యూహాన్ని మార్చుకుంటామని చెప్పారు.
 
మృతుల కుటుంబాలను కేంద్రం తరఫున ఆదుకుంటామని వెల్లడించిన ఆయన, మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మంత్రి వెంట ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్ జీ దాస్ టాండన్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్సరాజ్ ఆహిర్ తదితరులు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగపూర్‌లో భర్త.. ప్రియుడితో భార్య సల్లాపాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది..