Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరుగుదొడ్లు శుభ్రం చేయాలంటూ పంజాబ్ మాజీ సీఎంకు శిక్ష

Advertiesment
SukhbirBadal

ఠాగూర్

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (11:21 IST)
పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు సిక్కుల అత్యున్నత కమిటీ అకల్ తఖ్త్ తేరుకోలేని షాక్ ఇచ్చింది. సిక్కు మతాన్ని అవమానించిన కేసులో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు అనుకూలంగా వ్యవహరించినందుకు మరుగుదొడ్లను శుభ్రం చేయాలంటూ ఆదేశించింది. అమృత్ సర్‌లోని స్వర్ణదేవాలయం సహా పలు గురుద్వారాల్లో మరుగుదొడ్లను శుభ్రం చేయాలని వంటగదుల్లో అంట్లు తోమాలంటూ ఆదేశించింది. 
 
అలాగే, సిక్కు సమాజానికి సేవలు అందించినందుకు గాను సుఖ్‌బీర్ సింగ్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు 2011లో అందించిన ఫఖ్ర్-ఈ-క్వామ్ గౌరవాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ అత్యుతున్న కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. సుఖ్‌బీర్ తన తప్పులకు బేషరతు క్షమాపణలు చెప్పిన అనంతరం అకల్ తఖ్త్ ఈ శిక్షలను ఖరారు చేయడం గమనార్హం. 
 
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సహా కోర్ కమిటీ సభ్యులు, 2015లో నాటి ప్రభుత్వంలో సభ్యులుగా ఉన్న అకాలీ దళ్ నాయకులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో బాత్రూంలను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత స్నానాలు చేసి వంట శాళలో భోజనం వడ్డిస్తారు. ఆ తర్వాత శ్రీ సుఖ్‌మణివని పఠిస్తారు. పంజాబ్‌లో అకాలీ దళ్ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ మతపరమైన తప్పిదాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవకాశాలు లేకపోవడం వల్లే కన్నడ నటి శోభిత సూసైడ్ : డీసీపీ