కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై బీజేపీ నేత, పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ట్విట్టర్లో సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. మిస్టర్ రాహుల్ గాంధీ.. భారత ప్రధాని కావాలని కనేముందు.. బ్రిటన్‌లో మీకున్న రహస్య పౌరసత్వాన్ని, రౌత్ వించీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా రహస్యాలను దేశ ప్రజల ముందు పెట్టండి అంటూ ట్వీట్ చేశారు.
రాహుల్ అసలు పేరు రౌల్ వించీ అని.. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం వుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇంకా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోరు మెదపలేదు. అయితే రాహుల్ గాంధీ బ్రిటన్ వారసత్వంపై అప్పుడే నెట్టింట చర్చ మొదలైంది.